తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌తో డబ్బు పంపింది నువ్వు కాదా? నాతో బతికావ్: బాబుపై మోత్కుపల్లి ఘాటుగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వెనుకున్న ప్రతి ఒక్కరిని చంపిన చరిత్ర చంద్రబాబుది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్‌తో భేటీ ఎఫెక్ట్.. ఆనం వర్గంపై టీడీపీ వేటు: వైసీపీలోకి వెళ్లడం లేదా?జగన్‌తో భేటీ ఎఫెక్ట్.. ఆనం వర్గంపై టీడీపీ వేటు: వైసీపీలోకి వెళ్లడం లేదా?

నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు రారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని అన్నారు. చంద్రబాబు కాలు పెట్టిన ప్రాంతం నాశనమే అన్నారు. నేను పెద్ద మాదిగ అని చంద్రబాబు నోట దళితుల మాటే లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబూ! నన్ను అడ్డం పెట్టుకొని బతికావ్

చంద్రబాబూ! నన్ను అడ్డం పెట్టుకొని బతికావ్

కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జిలు కావొద్దా చంద్రబాబు అని నిలదీశారు. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బతికాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే అన్నా క్యాంటీన్లు అన్నారు.

ఓటుకు నోటులో డబ్బు పంపించింది మీరు కాదా?

ఓటుకు నోటులో డబ్బు పంపించింది మీరు కాదా?

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పట్టుబడ్డాడని, రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరూ ఉన్నారు కాబట్టే రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదన్నారు. అంతకుముందు రోజు ఆయన తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన ప్రశ్నలకు జవాబు చెబితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతానని సవాల్ చేశారు.

 శ్రీవారికి చంద్రబాబు పాపాలు చెప్పేందుకే

శ్రీవారికి చంద్రబాబు పాపాలు చెప్పేందుకే

చంద్రబాబు ఆధర్మంపై మోత్కుపల్లి ధర్మపోరాటం పేరుతో బుధవారం ఆయన తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌ తనకు రాజకీయ భిక్ష పెట్టారనే కృతజ్ఞతతో ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని వీడలేదని చెప్పారు. ఆవిర్భావం నుంచి టీడీపీ బలోపేతానికి కృషి చేసిన బలవంతంగా సాగనంపారన్నారు. చంద్రబాబు పాపాలను శ్రీవారికి వివరించేందుకు తాను తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు పెట్టిన బాధలతో తన రాజకీయ జీవితం నాశనమైందన్నారు.

వర్ల రామయ్య విమర్శలు

వర్ల రామయ్య విమర్శలు

కాగా, చంద్రబాబుపై మోత్కుపల్లి చేపట్టింది అధర్మ పోరాటమని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ధర్మపోరాటం పేరిట తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధికి పాదయాత్ర చేస్తూ చంద్రబాబును రాజకీయంగా నాశనం చేస్తాననడం మోత్కుపల్లి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.

English summary
Telangana leader Mothkupalli Narsimhulu hot comments on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X