వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఅర్ సిఎం కావడమే దోషం: మోత్కుపల్లి, కెసిఆర్ ప్రకటనలా: కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్/ హైదరాబాద్: తెలంగాణకు వాస్తుదోషం లేదు కె చంద్రశేఖర రావు సీఎం కావడమే తెలంగాణకు పెద్ద దోషమని తెలుగుదేశం తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. దళితుడిని సీఎం చేస్తానంటేనే ప్రజలు ఓట్లు వేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు దళితులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎల్లుండి ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తామని ఆయన అన్నారు.

మిషన్ కాకతీయతో లూటీ

మిషన్‌ కాకతీయ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బిజెపి నేత నాగం జనార్ధనరెడ్డి ఆరోపించారు. వాటర్‌గ్రిడ పథకానికి 25 వేల కోట్లు అవసరం లేదని 5 వేల కోట్లతోనే తెలంగాణ ప్రజలందరికీ తాగు నీరు అందించవచ్చని ఆయన అన్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకం అమలుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది లూటీ రాజ్యమని ఆయన ఆరోపించారు.

Mothkupalli lashes out at KCR and Kishan Reddy deplores budget

అసెంబ్లీలో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన శాసనసభలో ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ఖండించారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం దురదృష్టకరమన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో నినాదాలు చేయడం సరైన చర్య కాదని, ఈ విషయంలో టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు క్షమాపణ చెపాపలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

తెలంగాణ శాసనసభలో శనివారం జరిగిన సంఘటనను ఖండిస్తారా, సమర్థిస్తారా అని ఆయన కెసిఆర్‌ను అడిగారు. సభలో చోటు చేసుకున్న సంఘటనలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పస లేదని, కారం లేదని, అది ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ను తప్పుదోవ పట్టించారు

గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పుదో పట్టించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయించారని ప్రశ్నించారు. తెలంగాణలో నడిచేది టీడీపీ - టీఆర్‌ఎస్‌ సంకీర్ణ ప్రభుత్వమా అని నిలదీశారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam party leader Mothkupalli Narasimhulu lashed out at Telangana CM K Chandrasekhar Rao. BJP president G Kishan Reddy deplored the incidents took place in Telangana assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X