వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరింత కఠినంగా మోటార్ వాహనాల నిబంధనలు, ఉల్లంఘిస్తే ఫైన్ బాదుడే..బాదుడు..

|
Google Oneindia TeluguNews

పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే టూ వీలర్ నుంచి సెవెన్ సీటర్ కార్ల వరకు ఒకేవిధంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై వాహనాలకు అధికంగా జరిమానా విధించారు.

 విధులకు ఆటంకం కలిగిస్తే..

విధులకు ఆటంకం కలిగిస్తే..

పలు నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగించొద్దని స్పష్టంచేసింది. ఒకవేళ అలా చేస్తే రూ. 750 ఫైన్ వేస్తామని స్పష్టంచేసింది. ఆ సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా రూ. 750 వరకు జరిమానా విధిస్తామని తేల్చిచెప్పింది. అలాగే అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే రూ. 5000 వరకు ఫైన్ తప్పదని స్పష్టంచేసింది.

రూ.5 వేల ఫైన్

రూ.5 వేల ఫైన్

వాహనం నడిపేవారికి సంబంధించి.. అర్హత కంటే తక్కువ వయస్సు వారికి ఇస్తే రూ. 5000 వేల ఫైన్.. డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ. 10 వేల వరకు ఫైన్ తప్పదని తెలపింది. నిబంధనలకు విరుద్దంగా వాహనాల్లో మార్పులు చేసినా ముక్కుపిండి మరీ వసూల్ చేస్తారు. కనీసం రూ.5 వేల వరకు రుసుం తీసుకుంటామని తెలిపారు.

రూ.10 వేల ఫైన్..

రూ.10 వేల ఫైన్..

నిర్దేశిత వేగం కంటే స్పీడ్‌గా బండి నడిపితే రూ. 1000 ఫైన్.. సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేల ఫైన్ వేస్తారు. రేసింగ్ చేస్తూ ఫస్ట్ టైం దొరికితే రూ. 5000, రెండోసారి పట్టుబడితే మాత్రం రూ. 10 వేలు వేస్తారు. సదరు వాహనానికి రిజిస్ట్రేషన్ లేకున్నా.. ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకున్నా ఫైన్ తప్పదు. అయితే తొలిసారి రూ. 2 వేలు తీసుకుంటారు. రెండో సారి రూ. 5 వేలు వసూల్ చేస్తారు.

Recommended Video

TSRTC & APSRTC: No RTC buses Between Telangana to Andhra Pradesh Even for Dasara
రూ.లక్ష ఫైన్

రూ.లక్ష ఫైన్

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10 వేలు.. ఓవర్ లోడ్ వాహనానికి రూ.20 వేలు జరిమానా వేస్తారు. ఆపై టన్నుకు రూ. 2000 అదనంగా తీసుకుంటారు. వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా రూ. 40 వేలు ఫైన్ వేస్తారు. అలాగే ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ. 10 వేలు వసూల్ చేస్తారు. అనవసరంగా హారన్ మోగించినా ఫైన్ తప్పదు. ఫస్ట్ టైం రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలు/ డీలర్లకు, విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తారు.

English summary
motor vehicle fines very high in andhra pradesh state. government issue new GO for vehicle act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X