• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మస్తాన్ బాబు అంతిమయాత్రలో జనసంద్రమైన గాంధీ జనసంగం (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ప్రముఖ పర్వాతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అంతిమ యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అతడి స్వగ్రామం గాంధీ జనసంగంలో ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు నారాయణ, పల్లె రఘనాథ రెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మస్తాన్ బాబు భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో గాంధీజనసంగం గ్రామం జనసంద్రమైంది. గాంధీ జనసంగంలోని మస్తాన్ బాబుకు చెందిన పొలంలోనే ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పర్వతారోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించారని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని చాటిందన్నారు. మస్తాన్ బాబును సజీవంగా తీసుకురాలేకపోయామని విచారణ వ్యక్తం చేశారు. మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ కోరిక మేరకు ఆఖరి చూపుకైనా మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ, సుష్మస్వరాజ్ చొరవతో అర్జెంటీనా దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చామని చెప్పారు.

మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.

 ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

పర్వతారోహణలో ప్రాణాలు కోల్పోయిన మల్లి మస్తాన్ బాబు భౌతికకాయం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామానికి చేర్చారు. శనివారం స్వగ్రామం గాంధీజసంగంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

తన సోదరుడు మల్లి మస్తాన్ బాబుకు ఇలా ఆహ్వానం పలకడం చాలా బాధగా ఉందని, కానీ అతనిని చూసి తాము గర్విస్తున్నామని మల్లి సోదరి దొరసానమ్మ శుక్రవారం కంటతడి పెడుతూ చెప్పారు

 ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

తన సోదరుడిని తీసుకు వచ్చేందుకు కృషి చేసిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. మస్తాన్‌ బాబు భౌతికకాయాన్ని తీసుకొచ్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

 ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. మల్లి మస్తాన్ బాబు ఎన్నో విజయాలు సాధించారని, ఆయన విజయవాల పట్ల మనమంతా గర్వపడాలన్నారు.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సాయంతో సమన్వయం చేసుకున్నామని ఏపీ భవన్‌ అసిస్టెంట్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ఎయిరిండియా విమానంలో మల్లిమస్తాన్ బాబు భౌతికయాన్ని చెన్నై తరలించామని చెప్పారు.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ఊపిరి ఆడక మృతి మల్లి మస్తాన్ బాబు మృతి చెందారని శవపరీక్షలో వెల్లడైంది. చిలీలోని ఆండీస్ పర్వతాలపై మృతి చెందిన మల్లి మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మల్లి కెమెరాలో ఉన్న ఛాయాచిత్రాల ఆధారంగా దీనిని నిర్ధారించారు.

 ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

పర్వత శిఖరం నుండి సుమారు 650 మీటర్లకు దిగువకు వచ్చిన తర్వాత మృతి చెందారని మృతదేహాన్ని కిందకు తీసుకు వచ్చిన హెర్మన్ బృందం వెల్లడించింది.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘానికి చెందిన మల్లి.. చిలీ, అర్టెంటీనా దేశాల మధ్యన ఉన్న ఆండీస్ పర్వతాలపై ఆరువేల మీటర్ల ఎత్తులో గత నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

మృతదేహాన్ని బుధవారం బేస్ క్యాంపునకు తీసుకు వచ్చారు. గురువారం అర్జెంటీనాలోని టుకుమాన్ పట్టణంలో వైద్యులు శవపరీక్షలు పూర్తి చేశారు. కాగా, మల్లి మస్తాన్ బాబు పట్ల ఏ ప్రభుత్వమూ కనికరించలేదని సీపీఐ రాష్ట్ర నేత నారాయణ వాపోయారు. గురువారం నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘం గ్రామంలో మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ప్రారంభమైన మస్తాన్ బాబు అంతిమయాత్ర

ఈ సందర్భంగా మల్లి మస్తాన్ సజీవంగా ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతని ప్రతిభను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. చిలీ, అర్జంటీనా ప్రభుత్వాలు పర్వతారోహకులు ప్రమాదాలకు గురైనప్పుడు సత్వర చర్యలకు శ్రీకారం చుట్టి ఉండినా మల్లి బతికి ఉండేవారన్నారు.

English summary
Top Indian mountaineer Malli Mastan Babu, who died while scaling a mountain between Argentina and Chile, will be cremated on Saturday in his native village in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X