వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై లోక్‌సభ స్పీకర్ కు ఎంపి అవినాష్ ఫిర్యాదు...సంచలనం

|
Google Oneindia TeluguNews

కడప: ఒక బహిరంగ సభలో సిఎం తనను అవమానించారంటూ కడప ఎంపి అవినాష్‌ రెడ్డి చంద్రబాబుపై లోక్‌సభ స్పీకర్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రే తాను మాట్లాడుతుండగా మైక్ లాక్కొని అవమానించారని ఎంపి స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కంప్లయింట్ చేశారట.

జన్మభూమి కార్యక్రమంలో తాను బహిరంగ సభలో మాట్లాడుతుండగా సాక్షాత్తు ముఖ్యమంత్రే తన చేతిలోని మైక్ లాక్కొని తనను అవమానించారని ఎంపి అవినాష్ శుక్రవారం లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని పులివెందులలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న తాను బహిరంగ సభలో ఒక రౌడీ షీటర్‌ వేదికపై ఉండటమే కాకుండా తన మైక్‌ లాక్కుని తనపై దౌర్జన్యానికి దిగారని ఎంపీ స్పీకర్ కు వివరించినట్లు తెలిసింది.ఆ తర్వాత సిఎం చంద్రబాబు కూడా తన చేతిలోని మైక్ బలవంతంగా గుంజుకున్నారని ఎంపి అవినాష్ ఫిర్యాదులో పేర్కొన్నారట. తన గౌరవానికి భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ను కోరారట.

MP Avinash Reddy lodge complaint on CM Chandrababu

అలా జరిగింది...పులివెందులలో...


కడప జిల్లా పులివెందులలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు కడప ఎంపి అవినాష్ రెడ్డి, వైసిపి ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు సమక్షంలో కడప ఎంపి అవినాష్ రెడ్డి వేదికపై నుండి దివంగత వైఎస్ఆర్ జిల్లాకు చేసిన సేవల గురించి పొగుడుతుండగా దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు అభ్యంతరం చెప్పారు.

ఆ దశలో ముందు వేదిక మీద నున్న ఒక టిడిపి కార్యకర్త ఎంపి చేతిలో నుండి మైక్ ను లాక్కోవాలని చూసారు, ఆ తరువాత చంద్రబాబు కూడా అదే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవటంతో చివరకు మైక్ కనెక్షన్ కట్ చేయించారు.

English summary
Cuddapah MP Avinash Reddy had lodged complaint to the Lok Sabha speaker on AP CM Chandrababu. The MP Avinash explained to Sumitra Mahajan that CM grabbed mike from his hands and insulted him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X