కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌డ‌ప గ‌డ‌ప లో కార్పోరేట్ దిగ్గ‌జం.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం ప‌డ‌రాని పాట్లు..

|
Google Oneindia TeluguNews

ప్ర‌జా స‌మ‌స్య‌లు అస‌లే తెలియ‌ని ఆ నేత క‌డ‌ప గ‌డ‌ప‌లో ఉక్కు దీక్ష‌కు ఉపక్ర‌మించారు. గ‌త వారం రోజులుగా ఉక్కు సంక‌ల్పంతో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు. ప్ర‌జా క్షేత్రంతో అంత‌గా సంబందాలు లేని ఈ కార్పోరేట్ దిగ్గ‌జం అక‌స్మాత్తుగా దీక్ష‌కు దిగ‌డంతో క‌డ‌ప వాసులను నెవ్వ‌రప‌రుస్తోంది.. కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌ను త‌న క‌నుస‌న్న‌ల‌తో శాసించే ఆ ఎంపీ ప్ర‌భుత్వానికి కుడి భ‌జం లా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇంత వ‌ర‌కు క‌థ బాగానే ఉన్నా.. ఉన్న ప‌ళంగా ఉక్కు కర్మాగారం ఎందుకు గుర్తొచ్చింది..? వారం రోజులుగా దీక్ష కొన‌సాగిస్తున్నాత‌న ఆరోగ్యం ఇసుమంతైనా క్షీణించ‌లేదేమిట‌ని క‌డ‌ప వాసులు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Recommended Video

అడిగిందే అడుగుతారా, నేను లేఖ రాస్తా..చంద్రబాబు
మొట్ట మొద‌ట‌గా క‌డ‌ప గ‌డ‌ప‌లో సీయం ర‌మేష్.. ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ఉక్కు దీక్ష‌..

మొట్ట మొద‌ట‌గా క‌డ‌ప గ‌డ‌ప‌లో సీయం ర‌మేష్.. ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ఉక్కు దీక్ష‌..

ఆయన ప్రజా నాయకుడు కాదు. ప్రజలతో అస్సలు సంబంధం లేదు. తన రాజకీయ ప్రయాణంలో ఏ నాడు ప్రజల నుంచి ఎన్నిక కాలేదు. అయినా, పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. ప్రజల మధ్య కాక నాయకుడు నీడలో పెరిగారు. లీడర్ అనడం కంటే లాబీయిస్ట్ అన్న ముద్ర బలంగా వేసుకున్నారు. వ్యాపారవేత్త నుంచి పొలిటికల్ లీడర్ గా మారారు. ఆయనే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఆయన ఫస్ట్ టైం ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూ ధీక్షకు దిగారు. సీఎం రమేష్. సీఎం రమేష్ రాజకీయ జీవితంలో బహుశా ఇదే మొదటి ప్రజా పోరాటం అనుకుంటా !

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న త‌క్కువ‌.. ఐనా రెండు సార్లు రాజ్య‌స‌భ ఎంపీ..

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న త‌క్కువ‌.. ఐనా రెండు సార్లు రాజ్య‌స‌భ ఎంపీ..

ఆయన ఇన్నాళ్లు టీడీపీలో బ్యాక్ డోర్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. అన్నీ పార్టీల నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ కూడా చంద్రబాబు వద్ద పట్టు సాధించారు. తిమ్మిని బమ్మి చేయగల సమర్ధుడన్న పేరు తెచ్చుకున్నారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ దశలో సీఎం రమేష్ ను చంద్రబాబు దూరం పెట్టారన్న ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చీరావడంతోనే పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రమేష్ విందు ఇవ్వడమే దీనికి కారణంగా చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మళ్లీ రమేష్ సీఎంకు దగ్గరయ్యారు. చంద్రబాబు వద్ద తిరిగి పట్టు సాధించారు. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభ సీటు రెన్యూవల్ చేయించుకున్నారు. దీంతో ఆయన ఎంత గొప్ప లాబీయిస్టో అన్న ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. ఏదైతేనేమి మరోసారి రాజ్యసభ సభ్యుడుగా రమేష్ అవకాశం చేజిక్కించుకున్నారు.

ప్ర‌జా నాయ‌కుడిగా ముద్ర‌వేసుకోవాల‌న్న తాప‌త్ర‌యం..

ప్ర‌జా నాయ‌కుడిగా ముద్ర‌వేసుకోవాల‌న్న తాప‌త్ర‌యం..

అయితే, అంతలోనే రమేష్ వ్యవహార శైలి పై కడప టీడీపీ నేతల్లో అసహనం పెల్లుబికింది. జిల్లా రాజకీయాల్లో రమేష్ పెత్తనం ఎక్కువైపోయిందన్న ఆగ్రహం, ఆవేదన వారిలో వ్యక్తమైంది. వరదరాజుల రెడ్డి లాంటి లీడర్లు ఈ విషయం పై నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యకు ‘కామా' పెట్టాల్సివచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సీఎం రమేష్ కు అర్థమైనట్టుంది. అందుకే లాబీయిస్ట్ నుంచి పబ్లిక్ లీడర్ గా ప్రమోషన్ పొందే ప్రయత్నం మొదలుపెట్టినట్టున్నారు. ఫస్ట్ టైం పబ్లిక్ ఎజెండాతో ఆయన తెర మీదకు వచ్చారు.

ప్ర‌జ‌ల మ‌ద్య‌న ఉంటారా.. మ‌ళ్లీ కార్పోరేట్ గా కనిపించకుండా పోతారా..

ప్ర‌జ‌ల మ‌ద్య‌న ఉంటారా.. మ‌ళ్లీ కార్పోరేట్ గా కనిపించకుండా పోతారా..

రాష్ట్ర విభజన సమస్యల పై అడపా దడపా రాజ్యసభలో మాట్లాడటం మినహా ఇప్పటి వరకు ఆయన నేరుగా ఏ ప్రజా ఆందోళనను లీడ్ చేయలేదు. కనీసం... ఏ ఆందోళనలోనూ పెద్దగా పాల్గొన్నది కూడా లేదు. కానీ, సడెన్ గా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏకంగా ఆమరణ ధీక్షకు సిద్ధమై వార్తల్లో నిలిచారు. ఇక పై సీఎం రమేష్ ప్రజా నాయకుడుగా మారే ప్రయత్నం చేస్తారా లేక తిరిగి కార్పోరేట్ రంగంలో లాబీయిస్ట్ లీడర్ పోస్టులోకే వెళ్లిపోతారా అన్నది చూడాలి.

English summary
tdp mp cm ramesh doing hunger strike in kadapa for steel plant sanction. for the past 7 days he has been doing strike against central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X