వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెల్లవారు జామున జైలుకి గల్లా: అర్ద్రరాత్రి వరకూ పోలీసు వాహనంలోనే: 31 వరకూ రిమాండ్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP 3 Capitals : TDP MP Galla Jayadev Detained || Oneindia Telugu

ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించారు. అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న జయదేవ్ పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఎంపీ అరెస్ట్ కు నిరసన గా టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. మధ్నాహ్నం సమయంలో అసెంబ్లీ వద్ద ఎంపీని ఆంక్షలు ఉల్లంఘించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. అప్పటి నుండి అనేక ప్రాంతాల్లో తిప్పుతూ ఈ క్రమంలో పోలీసులు, జయదేవ్‌కు మధ్య పెనుగులాట జరిగి ఆయన చొక్కా సైతం చిరిగిపోయింది. ఈ తెల్లవారు జామున నాలుగున్నార సమయంలో ఆయన్ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

గల్లా జయదేవ్ కు రిమాండ్
అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్టైన ఎంపీ గల్లా జయదేవ్‌ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన్ను అరెస్ట్ చేసిన సమయం నుండి టీడీపీ శ్రేణుల నుండి ప్రతిఘటన ఎదురైంది. దీంతో..పోలీసులు ఆయన్ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట.. అక్కడి నుంచి రొంపిచర్ల స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. జిల్లా లో వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి అర్ధరాత్రి మూడు గంటలకు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. జనవరి 31వరకు రిమాండ్ విధించటంతో..హుటాహుటిన తెల్లవారు జామున 4.30గంటలకు గుంటూరు సబ్ జైలు కి తరలించారు.

MP Galla jayadev Remanded and shifted him to sub jail in this early hours

అసెంబ్లీ ముట్టడితో అరెస్ట్..
టీడీపీ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వటంతో.. పోలీసులు ముందుగానే అనేక మంది టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వటంతో పాటుగా హౌస్ అరెస్ట్ చేసారు. అయితే, ఎంపీ జయదేవ్ పోలీసుల నిఘా, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వ్యూహాత్మకంగా చేరుకున్నారు. దీంతో పోలీసులు జయదేవ్‌ను అడ్డుకొన్నారు. ఆ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఎంపీని అదుపులోకి తీసుకొనే సమయంలో రాజధాని గ్రామాల ప్రజలు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. దీంతో..పెనుగులాట చోటు చేసుకుంది. అక్కడ నుండి పోలీసులు అర్ద్రరాత్రి వరకు జయదేవ్ తను తమ వాహనంలో తిప్పుతూనే ఉన్నారు. పోలీసు వాహనంలోనే ఎంపీ ఆహారం తీసుకున్నారు. అర్ద్రరాత్రి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు.

English summary
Guntur MP Galla Jayadev Remanded up to 31st of this month and shifted him to sub jail in this early morning. Galla vaoilated police restriction in protest against three capitals bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X