వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ జలక్: జగన్ వాదనకే మద్దతు: అందుకే..వారంతా సైలెంట్.!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ వాదనకు టీడీపీ ఎంపీ మద్దతు లభించింది. కరోనా కట్టడి విషయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలంతా విమర్శించారు. రానున్న రోజుల్లో కరోనాతో జీవించి సాగాల్సిందేనన్న సీఎం వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టింది. కానీ కేంద్రంలోని ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు చివరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఆవాదనకే మద్దతుగా నిలిచారు. ఇప్పుడు టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ గల్లా జయదేవ్ సైతం జగన్ చెప్పిందే కరెక్ట్ అంటున్నారు.

Recommended Video

ఆ రెండు స్థానాలపై కిరికిరి.. న్యాయపోరాటానికి వైసీపీ రెడీ || Oneindia Telugu

జగన్ కోరిందే ప్రధాని చేశారా..? ఏపీకి కొత్త ఊరట..మారుతున్న రాజకీయ సమీకరణాలుజగన్ కోరిందే ప్రధాని చేశారా..? ఏపీకి కొత్త ఊరట..మారుతున్న రాజకీయ సమీకరణాలు

 గల్లా కామెంట్లతో కలకలం

గల్లా కామెంట్లతో కలకలం

ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు. తాను చేసిన సూచనలనే ప్రధాని పరిగణలోకి తీసుకున్నారంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా గల్లా చేసిన వ్యాఖ్య తెలుగు పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కరోనాతో రానున్న రోజుల్లో కలిసి జీవించాల్సిందేనని జయదేవ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేయగానే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కరోనాతో కలిసి కొనసాగాల్సిందేనని ఎలా చెబుతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలంతా ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.

 జయదేవ్ ట్వీట్‌పై చర్చ

జయదేవ్ ట్వీట్‌పై చర్చ

అయితే జగన్ చేసిన వాదనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాల ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పలువురు రాజకీయ ప్రముఖులు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రపంచ ఆరోగ్య సంస్థలు సైతం ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నాయి. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ వాదనకు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన కీలక ఎంపీ గల్లా జయదేవ్ ముఖ్యమంత్రి చెప్పిన దానికే మద్దతు ఇస్తున్నట్లుగా చేసిన ట్వీట్ టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

అంతా సైలెంటే..

అంతా సైలెంటే..

జగన్ వాదనకు ఊహించని మద్దుత లభించిన త్వారా టీడీపీ క్యాంపులో దానిపై చర్చ ముగిసిపోయింది. ఇప్పుడు కేంద్రం సైతం అదే వాదన చేస్తుండటంతో వారితో విబేధించేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఇదే విషయంపై సీఎం జగన్‌ను విమర్శించిన కొందరు బీజేపీ నేతలు సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక గల్లా జయదేవ్ ట్వీట్స్‌తో వైసీపీ నేతలు టీడీపీ పై రాజకీయంగా ఎదురుదాడికి సిద్దమయ్యారు. జయదేవ్ పార్టీ పరంగా తన వాదనను ఏరకంగా సమర్థించుకుంటారు, టీడీపీ అధినాయకత్వం ఏరకంగా రియాక్ట్ అవుతుందనేది వేచిచూడాలి.

English summary
CM Jagan who said that one needs to learn to live with Corona is well supported by TDP MP Galla Jayadev. This has erupted a new debate in TDP politically.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X