వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనను ఇప్పుడైనా విలీనం చేయండి...స్వాగతిస్తాం... ఎంపీ జీవిఎల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రెండు రోజులుగా బీజేపీపై ప్రంశంసల వర్షం కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ చుట్టు రాజకీయా పరిణామాలు తిరుగుతున్నాయి. దీంతో ఆయన బీజేపీలోకి వెళతారా లేక తన పార్టీని అందులో విలీనం చేస్తారా అనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు జనసేన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ప్రాంతీయ పార్టీలను విలీనం చేస్తానంటే అభ్యంతరం లేదని అన్నారు.

పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాము...

పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాము...

పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీలో విలీనం చేస్తాననంటే తాము స్వాగతిస్తానని ఎంపీ జీవీఎల్ నర్సింరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ విలీన ప్రక్రియతో ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోడీని కలిసి చర్చించేందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. దీంతో పాటు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వినసొంపుగా ఉన్నాయని, గుండెకు ఆపరేషన్ జరిగినట్టుగా వారిలో మార్పులు వచ్చాయని అన్నారు.

గత వ్యాఖ్యలు పునరావృతం కాకుడదు..

గత వ్యాఖ్యలు పునరావృతం కాకుడదు..

అయితే పవన్ కల్యాణ్ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకుని భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని ప్రజలు హమీ ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు ఆయనలో మానసికంగా మార్పు వచ్చి బీజేపీలో విలీనం చేస్తానంటే అభ్యంతరం లేదని , తాము గత ఎన్నికల ముందు కూడ పార్టీని విలీనం చేయాలని కోరామని అయితే అప్పుడు పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించలేదని అన్నారు. ఇక ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీని విలీనం చేస్తున్నట్టుగా తనకు అనిపిస్తున్నాయని అన్నారు.

 అలా అయితే కుదరదు...

అలా అయితే కుదరదు...


అయితే వారి ప్రస్తుత అవసరాల కోసమే పార్టీలో చేరుతానంటే తాము అంగీకరించే అవకాశాలు లేవని, పార్టీ విధానాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటేనే పార్టీ విలీనానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీల పొత్తులకు అవకాశాలు లేవని , ఎందుకంటే ఎన్నికలు ఇప్పట్లో లేవని చెప్పారు. దీంతో అధిష్టానంపై గౌరవభావంతో పార్టీ పెద్దలను కలిసి పార్టీని విలీనం చేస్తానంటే స్వాగతిస్తామని చెప్పారు. కాని తక్షణ అవసరాల కోసమంటే మాత్రం అందుకు ఒప్పుకునే అవకాశాలు లేవని అన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ భుజాన ఆరడగుల బుల్లెట్‌ను పెల్చుతామంటే అంగీకరించేది లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

English summary
MP GVL Narsimharao has made key comments, that they would welcome PawanKalyan's comments of merger with the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X