చంద్రబాబు, నారాయణలపై జేసీ సంచలనం: దొంగల్లా అమ్ముకుంటారని..
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
అమరావతి అభివృద్ధికి తన సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణకు ఎంపి జేసీ సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు బ్యాంకుతో టైఅప్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. లేదంటే ఎమ్మెల్యేలు ఆ స్థలాన్ని కొంతకాలం తర్వాత దొంగల్లా అమ్ముకుంటారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి ఇళ్లు నిర్మించకుండా అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇళ్లు కూడ ఒక్కొక్కరికి ఒక కిలోమీటర్ దూరంలో నిర్మించాలని ఆయన మంత్రికి సూచించారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య గొడవ లేకుంటా ఉంటుందన్నారు.
కర్నూలు కార్పోరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎంపీ టిజి వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలతో భేటీ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications