వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమైంది, అంతా సర్దుకుంది: ఢిల్లీలో జేసీ దివాకర్ రెడ్డితో ఏకాంతంగా బాబు భేటీ

అనంతపురంలో ఇటీవల నీటి వివాదానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నేత, అనంత పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకాంతంగా భేటీ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/అమరావతి: అనంతపురంలో ఇటీవల నీటి వివాదానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నేత, అనంత పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకాంతంగా భేటీ అయ్యారు.

జగన్ పాదయాత్ర వాయిదా వెనుక అసలు కథ ఇదీ: జిమ్మిక్కు లేదు, ప్లానూ కాదు!జగన్ పాదయాత్ర వాయిదా వెనుక అసలు కథ ఇదీ: జిమ్మిక్కు లేదు, ప్లానూ కాదు!

పంతం నెగ్గించుకున్న జేసీ

పంతం నెగ్గించుకున్న జేసీ

చాగల్లు రిజర్వాయర్‌కు నీళ్లు ఇప్పించుకోలేకుంటే ఇక తాను ఎంపీగా ఉండి ఏం లాభమని, తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి అధిష్టానం వద్ద తన బెట్టు నెగ్గించుకున్న విషయం తెలిసిందే.

అనంతలో చిచ్చు

అనంతలో చిచ్చు

జేసీ దివాకర్ రెడ్డి బెదిరించి నీరు తీసుకు వెళ్తున్నారని, తాము కూడా అలాగే బెదిరించి అలాగే తీసుకు వెళ్లాలా అని శింగనమల నియోజకవర్గ రైతులు, టిడిపి నేతలు ఏకంగా అధికారులను, పరోక్షంగా అధికార పార్టీని నిలదీశారు. స్వయంగా టిడిపి ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి కూడా నిలదీశారు.

జేసీతో చంద్రబాబు ఏకాంత భేటీ

జేసీతో చంద్రబాబు ఏకాంత భేటీ

మొత్తానికి అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా పేరుతో హెచ్చరికలు జారీ చేసి నీటిని విడుదల చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఎంపీ జేసీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ కావడం గమనార్హం. అందుబాటులో ఉన్న ఎంపీలతో భేటీ అనంతరం జేసీతో ఏకాంతంగా భేటీ అయ్యారు

అంతా సర్దుకుపోయింది

అంతా సర్దుకుపోయింది

జేసీ దివాకర్ రెడ్డితో భేటీ సందర్భంగా అనంతలో వివాదం, రాజీనామా తదితర అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. అంతా ఎప్పుడో చల్లారిపోయిందని జేసీ కూడా అధినేతకు వివరించారు. వివాదాలన్ని సమసిపోయాయని ఆయనకు చెప్పారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సమర్థవంతంగా పని చేస్తున్నారని, అనంతపురం అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారని తెలిపారు.

కేంద్రం నిధులు, పనుల బాధ్యతలు ఎంపీలకు అప్పగింత

కేంద్రం నిధులు, పనుల బాధ్యతలు ఎంపీలకు అప్పగింత

అంతకుముందు, తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎంపీలతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. ముగ్గురు చొప్పున ఎంపీలు ఐఏఎస్‌ అధికారులతో కలిసి ఏయే శాఖల్లో, విభాగాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి పరిష్కార దిశగా ముందుకెళ్లాలని సూచించారు.

ఏపీ భవన్ ఆస్తుల పంపకాలపై..

ఏపీ భవన్ ఆస్తుల పంపకాలపై..

ఏపీ భవన్‌ ఆస్తుల పంపకాలపై ఇటీవల కేంద్రం ఆరుగురితో కమిటీ వేసిన నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలు సీఎం రమేశ్‌, కేశినేని నాని, జేసీ దివాకర్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలతో భేటీ అయ్యారు. ఏపీ భవన్‌ ఆస్తుల పంపకాలపై సమీక్షించారు. ప్రక్రియ సజావుగా సాగేలా ఎంపీలు సహకరించాలన్నారు. ప్రత్యేక కమిషనర్‌ రజత భార్గవ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

English summary
Anantapur MP and Telugu Desam Party leader JC Diwakar Reddy has met Chief Minister Nara Chandrababu Naidu in New Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X