రిషికేశ్వరి మృతి: చంద్రబాబుకు ఎంపీ కవిత లేఖ
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషికేశ్వరి మృతి పైన సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. సమాజానికి దారి చూపించాల్సిన విద్యాలయాలు అరాచక శక్తుల చేతులలోకి చిక్కి ఆటవిక ప్రవృత్తికి వేదికలు కావడం బాధాకరమన్నారు.

రిషికేశ్వరి కేసులో నిందితులకు పలుకుబడి ఉన్న వారి అండదండలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనల పైన అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆడకూతుళ్లు బలికాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications