వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా.. దేశానికి మంచిదికాదు: కేశినేని సంచలనం, సోనియాను చూపి శివప్రసాద్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

Recommended Video

జైలుకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షులు దేశ రాజకీయాలు నడపడం దురదృష్టకరం

న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును, పార్టీ నేతలను ఆయన విమర్శించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. స్వయంగా చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన తన తల్లిదండ్రులను అనడం సరికాదని, ఇదేనా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం, భారతీయ సంప్రదాయం అన్నారు. మంత్రి జలీల్ ఖాన్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఓ బ్రోకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన బ్రోకర్ పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ తీరు ఇక్కడ పోరాటం, అక్కడ ఆరాటం అన్నట్లుగా ఉందని చెప్పారు.

మాల్యాతో పోల్చుతావా, పరిటాల నుంచి ఇవీ మీ నేరాలు, నువ్వో చార్లెస్ శోభరాజ్: బాబుని కడిగేసిన విజయసాయిమాల్యాతో పోల్చుతావా, పరిటాల నుంచి ఇవీ మీ నేరాలు, నువ్వో చార్లెస్ శోభరాజ్: బాబుని కడిగేసిన విజయసాయి

దేశానికి మంచిది కాదు.. అమిత్ షాపై కేశినేని నాని

దేశానికి మంచిది కాదు.. అమిత్ షాపై కేశినేని నాని

పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి, జైలుకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దేశ రాజకీయాలు నడపడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీజేపీ నాటకం ఆడిస్తోందన్నారు. మీన్ మెంటాలిటీ ఉన్నవాల్లు ఉన్నతస్థాయి పదవుల్లో ఉండటం దేశానికి మంచిది కాదన్నారు.

బుద్ధి ఉన్నవారు తల్లిదండ్రుల్ని నిందిస్తారా?

బుద్ధి ఉన్నవారు తల్లిదండ్రుల్ని నిందిస్తారా?

ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆర్థిక నేరస్తుడైన విజయసాయి రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేరుగా అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బుద్ధి ఉన్నవారు ఎవరైనా తల్లిదండ్రుల్ని నిందిస్తారా అని ప్రశ్నించారు. విజయసాయి విమర్శల వెనుక బీజీపీ ఉందన్నారు.

మరోసారి ఇలాగే మాట్లాడితే.. హెచ్చరిక

మరోసారి ఇలాగే మాట్లాడితే.. హెచ్చరిక


చంద్రబాబు ప్రజానేత అని బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయి ధనబలం ఉన్న నీచ రాజకీయ నాయకుడన్నారు. ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తోందన్నారు. ప్రధాని కాళ్లపై పడ్డ విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం దారుణం అన్నారు.

నారదుడి వేషధారణలో శివప్రసాద్ నిరసన

ఇదిలా ఉండగా, ఏపీకి న్యాయం చేయాలంటూ ప్రతి రోజు వివిధ వేషధారణల్లో వస్తూ నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బుధవారం నారదుడి వేషంలో నిరసన తెలిపారు. వింటేనే ఉంటారు మోడీ అంటూ పద్యం పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్‌తో పెట్టుకొని కాంగ్రెస్ దెబ్బతిన్నదని, విభజన చేయవద్దని సోనియాకు చెప్పినా వినలేదని, దీంతో ఆ పార్టీ దెబ్బతిన్నదని, ఇప్పుడు మోడీ కూడా వింటేనే బాగుంటారన్నారు.

English summary
Telugudesam leader and Vijayawada MP Kesineni Nani hot comments on Bharatiya Janata Party chief Amit Shah, TDP target Vijaya Sai Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X