విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని నాని టీడీపీ వీడుతున్నట్లేనా :చ‌ంద్ర‌బాబుకు అల్టిమేటం వెనుక : పెంపుడు కుక్క అంటూ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆ పెంపుడు కుక్క‌ను కంట్రోల్ చేయండి అంటూ కేశినేని నాని ఫైర్!! | Is MP Kesineni Nani Ready To Resign??

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అల్టిమేటం జారి చేసారు. తాను పార్టీలో ఉండ‌టం ఇష్టం లేక‌పోతే..ఎంపీ ప‌ద‌వికి..పార్టీకి రాజీనామా చేయ‌టానికి సిద్దంగా ఉన్నాన‌ని తేల్చి చెప్పారు. కొద్ది రోజులుగా ట్విట్ట‌ర్ ద్వారా పార్టీలో నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న కేశినేని నాని..తాజాగా పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పైన చేసిన ట్వీట్లు రాజకీయ ర‌గ‌డ‌కు కార‌ణ‌మ‌య్యా యి. అదే స‌మ‌యంలో బుద్దా వెంకన్న సైతం తీవ్రంగా ప్ర‌తి స్పందించారు. దీంతో..ఇద్ద‌రి మ‌ధ్య ముదిరిని ట్వీట్ల వార్ ఇప్పుడు చంద్రబాబుకు అల్టిమేటం వ‌ర‌కు వెళ్లింది. ఇదే ట్వీట్‌లో కేశినేని తాజాగా చేసిన పోస్టింగ్‌లో తాను రాజీనామా కు సిద్దంగా ఉన్నాన‌ని చెప్ప‌టం ద్వారా..ఇప్పుడు పార్టీ అధినేత చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టేలా..

చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టేలా..

తాజా ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా గెలిచిన నాటి నుండి కేశినేని నాని ట్వీట్ల ద్వారా పార్టీలో సంచ‌ల‌నం గా మారారు. ఆయ‌న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కుతున్న‌ట్లుగా స్ప‌ష్టం అయింది. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకొని నానితో మాట్లాడారు. వేడి త‌గ్గిన‌ట్లే త‌గ్గి..మ‌రోసారి ట్వీట్ల యుద్దం ప్రారంభ మైంది. అందులో భాగంగా.. కొద్ది రోజులు క్రితం పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్‌, ‘నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్‌ చేశారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టిక్కెట్ ఎవ‌రికి ఇవ్వాల‌నే అంశం పైన నాని ప్ర‌తిపాద‌న‌కు బుద్దా వెంక‌న్న అడ్డు చెప్పారు. అప్ప‌టి నుండి న‌డుస్తున్న కోల్డ్ వార్ ఇక ఇప్పుడు ట్వీట్ల యుద్దంగా మారి పార్టీ అధినేత చంద్ర‌బాబునే ఇర‌కాటంలో పెట్టే స్థాయికి చేరింది.

ఉమా..బుద్దా వెంక‌న్న ల‌క్ష్యంగా..

ఉమా..బుద్దా వెంక‌న్న ల‌క్ష్యంగా..

మాజీ మంత్రి దేవినేని ఉమా..ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ల‌క్ష్యంగా కేశినేని నాని ట్వీట్లు చేస్తున్నారు. నాలుగు ఓట్లు సంపా దించలేనివాడు నాలుగు పదవులు సంపా దిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు.. దౌర్భాగ్యం' అంటూ నాని ట్వీట్‌ చేశారు. నాని ట్వీట్‌కు వెంకన్న వెంటనే స్పం దించారు. ‘సంక్షోభ సమయం లో పార్టీ కోసం నాయకుడు కోసం పోరా డేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశ వాదులు కాదు.. చనిపోయే వరకు చంద్ర బాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలి' అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే స‌మ‌యంలో కేశినేని నానికి మ‌ద్ద‌తుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేసారు . కొడాలి నానిని ఉద్దేశిస్తూ..పరోక్షంగా కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పైన నాని చేసిన ట్వీట్ క‌ల‌క‌లం సృష్టించింది. ఇక‌, ఇప్పుడు కేశినేని పార్టీలో ఈ విష‌యం పైన తాడో పేడో తేల్చోకోవాల‌ని నిర్ణ‌యించారు.

 పార్టీ వీడుతానంటూ అల్టిమేటం..పెంపుడు కుక్క‌ను

పార్టీ వీడుతానంటూ అల్టిమేటం..పెంపుడు కుక్క‌ను

ఇక‌, ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే విష‌యం అర్దం అవుతోంది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్‌లో పార్టీలో తాను అస‌వ‌రం లేద‌ని భావిస్తే ఆ విష‌యం త‌న‌కు స్ప‌ష్టం చేయా ల‌ని..తానున ఎంపీ ప‌దవితో పాటుగా పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ట్వీట్ ద్వారానే చంద్ర‌బాబుకు అల్టిమేటం జారీ చేసా రు. అదే స‌మ‌యంలో పెంపుడు కుక్క‌ను కంట్రోల్ చేయండి అంటూ ప‌రోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్దం చేస్తున్న నేత గురించి ప్ర‌స్తావించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో..సాధార‌ణంగా ఏ నిర్ణ‌యంలో అయినా దూకుడు స్వ‌భావం తో ఉండే కేశినేని నాని..ఇప్పుడు త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపి..బుద్దా వెంక‌న్న మీద చ‌ర్య‌ల దిశ‌గా ఒత్తిడి పెంచుతారా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇప్పుడు, ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది బెజ‌వాడ రాజ‌కీ యాల్లో ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
Vijayawada MP Kesineni Nani in his latest tweet ultimatum for Chandra babu that he is ready for resign Mp and for party. He asked Chandra babu to control pet dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X