వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవగాహన లేదా?: తడబడ్డ మేకపాటి.. అదెంతో కార్యకర్తలనే చెప్పమన్నాడు!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వచ్చే 2019ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంతో పాటు 'నవరత్నాలు' హామిని బలంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాపై తాము చేస్తున్న పోరాటాన్ని, అలాగే నవరత్నాల హామిలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. నవరత్నాల హామిల గురించి చెప్పాల్సిన పెద్దలకే దానిపై సరైన అవగాహన లేకుండా పోయిందా? అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. సోమవారం విశాఖలో నిర్వహించిన 'వంచన దీక్ష'లో వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తడబడ్డ తీరు ఇందుకు
ఊతమిచ్చింది. దీక్షలో భాగంగా మాట్లాడిన ఆయన నవరత్నాల గురించి ప్రస్తావిస్తూ.. వికలాంగుల పెన్షన్ ఎంత ఇవ్వబోతున్నామన్నది చెప్పడానికి తడబడ్డారు.

mp mekapati rajamohan reddy flurry on navaratnas

ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని.. వికలాంగులకు తప్పనిసరిగా రూ.3వేల పింఛను వస్తుందని అన్నారు. ఆ వెంటనే ఫించను రూ.2వేలా రూ.3వేలా అంటూ అక్కడే ఉన్న కార్యకర్తలను ఆరా తీశారు. దీంతో ఒకరు రూ.3వేలు అంటూ సమాధానం ఇవ్వగా.. అంత మొత్తాన్ని వికలాంగులకు పెన్షన్ గా ఇస్తామన్నారు.

ఇంతలోనే మరో మహిళ రూ.2వేలు అనడంతో.. జగన్ చెప్పినట్టుగా వికలాంగులకు రూ.2వేల పెన్షన్ ఇస్తామన్నారు. దీంతో నవరత్నాల హామిలపై వైసీపీ నేతలకే క్లారిటీ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తాయి.

English summary
Is YSRCP MP's are not aware about the 'Navaratna' promises which is thier election manifesto, MP Mekapati Rajamohan Reddy speech raises this doubts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X