వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష్ట్రాల నుండి విజ్ఞప్తుల వెల్లువ కొనసాగుతుంది. డబ్బుల్లేవ్.. దయచేసి సహాయం చెయ్యండి అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్ర సహాయం కోరుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి ఏపీ చేరింది.

కరోనా ఎఫెక్ట్ .. ఆర్ధిక కష్టాల్లో రాష్ట్రాలు

కరోనా ఎఫెక్ట్ .. ఆర్ధిక కష్టాల్లో రాష్ట్రాలు

ఒకపక్క కరోనా వైరస్ , మరో పక్క లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడికక్కడ కొనసాగుతున్న ప్రతిష్టంభన వెరసి ఖజానాలకు పెద్ద కష్టం వచ్చింది . ఒకవైపు అనుకోని కరోనా నియంత్రణా వ్యయం, మరోవైపు రాబడి శూన్యం కావటంతో రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. కేంద్రం ఆదుకోకపోతే అంతే సంగతులంటూ రాష్ట్రాలు కేంద్రం వైపు దీనంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకపక్క కరోనా నియంత్రణ కోసం కేంద్రం పోరాటం చెయ్యమంటే రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు చాలా రాష్ట్రాలను ఆర్ధిక కష్టాలలోకి నెడుతున్నాయి.

ఇప్పటికే కేంద్ర సాయం కోరిన పశ్చిమ బెంగాల్ ..అదేబాటలో ఏపీ

ఇప్పటికే కేంద్ర సాయం కోరిన పశ్చిమ బెంగాల్ ..అదేబాటలో ఏపీ

ఇప్పటికే కరోనా సాయం కోసం కేంద్రానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లేఖ రాసింది. ఏకంగా 25వేల కోట్ల రూపాయలు కరోనా నియంత్రణా చర్యల కోసం సాయం చేయాలని కోరింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా కరోనా కేసులు పెరగటంతో ఆర్ధిక కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో తాజాగా వైసీపీ లోక్ సభ పక్ష నేత, ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌లకు లేఖలు రాశారు. ఖజానా ఖాళీ అయ్యింది. డబ్బుల్లేవ్ అని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని ఆయన తన లేఖలో కోరారు .

ఏపీ ఖజానా ఖాళీ ... ఆర్ధిక సాయం కోసం కేంద్రానికి లేఖ

ఏపీ ఖజానా ఖాళీ ... ఆర్ధిక సాయం కోసం కేంద్రానికి లేఖ


కరోనా వైరస్‌తో దేశంపై 348 మిలియన్ డాలర్ల ప్రభావం పడిందని తన లేఖలో పేర్కొన్న మిథున్ రెడ్డి కరోనా వైరస్‌తో ఆంధ్ర ప్రదేశ్ ఖజానా ఖాళీ అయిందని ఇక కేంద్రమే సాయం చెయ్యాలని పేర్కొన్నారు . ఆర్థిక వనరుల మార్గాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, ఇక ఆర్ధికంగా కేంద్రం తప్ప సాయం అందించే మార్గాలు అడుగంటిపోయాయని మిథున్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ప్రజారోగ్యం కాపాడటం , ప్రజలను కరోనాను ఎదుర్కొనేందుకు బలోపేతం చెయ్యటం , కరోనా వైరస్ కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం తదితర చర్యలతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడిందని ఆయన కేంద్రానికి తన లేఖలో వివరించారు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరిన ఎంపీ మిథున్ రెడ్డి

ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరిన ఎంపీ మిథున్ రెడ్డి

ఇక ఇలాంటి కష్ట సమయంలో ఆదుకోవాల్సింది కేంద్రమేనని ,కేంద్ర ప్రభుత్వం తక్షణమే జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని మిథున్ రెడ్డి సూచించారు. ఇక ద్రవ్యలోటు లక్ష్యాన్ని డ్రాప్ చేయాలని, అన్ని వ్యాపార, పరిశ్రమల రుణాల రికవరీని ఏడాది పాటు వాయిదా వేయాలని మిథున్ రెడ్డి కోరారు. ద్రవ్య లోటును అధిగమించి డబ్బు ఆర్జించేందుకు ఆర్బీఐతో కలిసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిథున్ రెడ్డి తన లేఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు .

English summary
YSRCP MP Mithun Reddy said that the Andhra Pradesh treasury should be empty with the corona virus effect.Mithun Reddy suggested that the central government should immediately announce an economic stimulus package of 8 to 10 per cent of GDP. Mithun Reddy urges the liquidity target to drop and all business and industry debt recovery be deferred for a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X