వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి రైతుల ఆందోళన సహజం: అప్పుడే..క్లారిటీ వచ్చేది: రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

రాజధాని రైతలు..స్థానికుల ఆందోళన పైన వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ రాజు స్పందించారు. అమరావతి రాజధాని మార్పుపై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని వ్యాఖ్యానించారు. అయితే, రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుందని గుర్తు చేసారు. మంత్రివర్గంలో ఆమోదం.. అసెంబ్లీలో ఆమోదం పొందితే కానీ..రాజధాని అంశం మీద పూర్తి స్పష్టత రాదని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.

NRCకి వైసీపీ వ్యతిరేకం.. ముస్లింలకు అండగా ఉంటాం.. సీఎం జగన్ కీలక ప్రకటనNRCకి వైసీపీ వ్యతిరేకం.. ముస్లింలకు అండగా ఉంటాం.. సీఎం జగన్ కీలక ప్రకటన

రైతుల ఆందోళన సహజం
అమరావతి తరలింపు పైన రైతుల ఆందోళన సహజమని..వారి ఆందోళనను తప్పు పట్టాల్సిన అవసరం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వ్యాఖ్యానించారు. కాదన్నారు. అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుందని చెబుతున్నామని స్పష్టం చేశారు.

MP Raghu Rama Raju says after cabinet and Assembly approval only capital shift may take place

అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి కనుక తమకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఆమోదం తరువాతనే..క్లారిటీ
రాజధానిపై పూర్తి క్లారిటీ.. కేబినెట్‌లో ఆమోదం,..అసెంబ్లీలో ఆమోదం జరిగితే కానీ రాదన్నారు రఘురామ రాజు. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిందని.. దానితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందు తాయన్నారు. అమరావతి అభివృద్ధికి ఏ లోటు జరగదన్నారు. అమరావతిలో అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం కూడా జరిగిందని గుర్తు చేశారు.

సంక్రాంతి కోడి పందాలపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. జూదానికి, హింసకు తావు లేని కోడిపందాలు సంక్రాంతికి కచ్చితంగా జరుగుతాయన్నారు. కోడిపందాలు సంక్రాంతి పండగలో ఒక భాగమని.. మన సంస్కృతీసంప్రదాయలలో అంతర్భాగమన్నారు. కోడి పందాలను మన గోదావరి జిల్లాల నుంచి ఎవరూ విడదీయలేరని.. అలా ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.

English summary
YCP MP Raghu Rama Raju key comments on farmers agitation in Amaravati. He says after abinet approval and Assembly decision only official announcement may take.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X