• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇక తెలంగాణపై రఘురామ భారం -సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి వైసీపీ ఎంపీ -భార్య రమాదేవి తీవ్ర వ్యాఖ్యలు

|

దేశద్రోహం ఆరోపణల కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బాగోగుల భారం ఇప్పుడు తెలంగాణ పంచుకోనుంది. కస్టడీలో పోలీసులు కొట్టారంటూ ఎంపీ ఆరోపించగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎంపీ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ అంశాన్ని వచ్చే శుక్రవారం విచారిస్తామన్న కోర్టు.. రఘురామను వెంటనే తెలంగాణలోని ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలివ్వడంతో..

 ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ? ఎంపీ రఘురామ వివాదంలో మరో ట్విస్ట్ -జగన్ సర్కారుపై సుప్రీంకోర్టుకు ఆ రెండు ఛానళ్లు -ఎదురుదెబ్బ?

ఆర్మీ ఆస్పత్రికి రఘురామ

ఆర్మీ ఆస్పత్రికి రఘురామ

రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని జస్టిస్‌ వినీత్ శరణ్‌, జస్టిస్‌ బీఆర్ గవాయ్‌ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ నుంచి వచ్చిన సందేశాలకు అనుగుణంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తరలింపు ప్రక్రియకు పూనుకున్నారు. ప్రత్యేక వాహన శ్రేణిలో రోడ్డు మార్గం ద్వారా ఎంపీ రఘురామను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. రాత్రి 10 గంటలకు కాన్వాయ్ హైదరాబాద్ చేరనుంది. ఇక్కడికి వచ్చాక..

బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?బట్టలు చించుకున్న రఘురామ -సుప్రీం షాక్ -సాయిరెడ్డి జారుడు బండ ఫిలాసఫీ -జగన్‌కు చంద్రబాబు సిఫార్సా?

ఏపీ ఎంపీ కోసం తెలంగాణ అధికారులు

ఏపీ ఎంపీ కోసం తెలంగాణ అధికారులు

నర్సాపురం ఎంపీ రఘురామ వైద్యపరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల్లో తెలంగాణకు సైతం డైరెక్షన్లు జారీ అయ్యాయి. ఎంపీని గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆయన పరిస్థితి తెలంగాణ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇందుకోసం ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను నియమించింది. సదరు అధికారి ఆధ్వర్యంలో వైద్య బృందం రఘురామకు జరిపే పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాల్సిన బాధ్యత కూడా తెలంగాణపైనే పడింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ ఎస్ ఆదిత్యనాథ్.. తెలంగాణ అధికారులతోనూ మంతనాలు జరిపి, ఎంపీని సికింద్రాబాద్ తరలించారు. ఈ నెల 21 వరకు ఆయన సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే,

  Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu
  రఘురామ భార్య అనూహ్య కామెంట్లు!

  రఘురామ భార్య అనూహ్య కామెంట్లు!

  రఘురామను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలు, వాటి అమలులో ఏపీ సర్కారు జాప్యంపై ఎంపీ భార్య రమాదేవి అనూహ్యంగా స్పందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు రఘురామ భార్య రమాదేవి ఫోన్ చేశారని, తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని అన్నట్లు తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆమె కోరడంతో కాసేపట్లోనే ఎస్కార్ట్ తో సహా పంపుతామని సీఎస్ బదులిచ్చినట్లు సమాచారం. మొత్తానికి రఘురామ ఎపిసోడ్ లో ఇప్పుడు సీన్ సికింద్రాబాద్ కు చేరింది.

  English summary
  as per the supreme court order, the andhra pradesh govt has shifted arrested ysrcp mp raghurama krishnam raju to secunderabad army hospital from guntur. telangana judicial officials appointed by ts high court to examine mp raghu rama health condition in secbad hospital. meanwhile raghu ram's wife ramadevi once again made key alligation on jagan govt regarding life threat to mp. ramadevi spoke to ap cs adityanath das.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X