• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామ లేఖాస్త్రాలు: సీఎం జగన్‌కు వరుసగా నాలుగోసారి-ఉద్యోగాల క్యాలెండర్‌పై నిలదీసిన ఎంపీ

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీఎంకు వరుసగా మూడు లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా నాలుగో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ హామీని నెరవేర్చలేదని తాజా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని రఘురామ కృష్ణరాజు గుర్తుచేశారు.

ఆ హామీ ఇంకా నెరవేరలేదు : రఘురామ

ఆ హామీ ఇంకా నెరవేరలేదు : రఘురామ

ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామన్న హామీ కారణంగానే ఎన్నికల్లో నిరుద్యోగులు వైసీపీకి మద్దతునిచ్చారని రఘురామ పేర్కొన్నారు. ఈ ఏడాది ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందని చాలామంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మెగా డీఎస్సీపై కూడా జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. తన లేఖను అత్యవసరంగా పరిగణలోకి తీసుకుని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.

ఆ పోస్టుల సంగతేంటి : రఘురామ

ఆ పోస్టుల సంగతేంటి : రఘురామ

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో 8402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖలో 6100 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే పోలీస్ శాఖలోనూ 6 వేల పోస్టులు రిక్రూట్‌మెంట్‌ చేయాల్సి ఉందన్నారు. 2018-19లో ఏపీపీఎస్సీ ద్వారా 3 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని... కానీ కోర్టులో కేసుల కారణంగా అంతంత మాత్రంగానే భర్తీ ప్రక్రియ జరిగిందన్నారు. కొన్నేళ్ల నుంచి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయట్లేదన్నారు.

అంతకుముందు మూడు లేఖలు...

అంతకుముందు మూడు లేఖలు...

అంతకుముందు,ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానాన్ని అమలుచేయాలని,వృద్ధాప్య పింఛ‌న్లు,వైఎస్సార్ పెళ్లి కానుక-షాదీ ముబారక్ హామీని నెరవేర్చాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రాజద్రోహం ఆరోపణలతో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన రఘురామ... అప్పటినుంచి జగన్‌ సర్కార్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

తన విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,గవర్నర్లకు లేఖలు రాశారు. కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాదు,అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇంకెంత దూరం వెళ్తుందో...

ఇంకెంత దూరం వెళ్తుందో...

ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలిసొచ్చారు. బెయిల్ రద్దు టెన్షన్‌తోనే జగన్ ఢిల్లీ బాట పట్టారని ప్రత్యర్థులు విమర్శించగా... రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే పలుమార్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ.. ఇటీవల మరోమారు ఫిర్యాదు చేసింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై వేటు వేయాలని స్పీకర్‌కు సమర్పించిన ఫిర్యాదు లేఖలో ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామ మాత్రం తాను ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నారు. తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదని ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ సర్కార్ వర్సెస్ రఘురామ పోరు ఇంకెంత దూరం వెళ్తుందోనన్న చర్చ జరుగుతోంది.

English summary
YSCP rebel MP Raghuram Krishna Raju continues to write letters to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy. The MP who has already written three letters in a row to the CM .. recently wrote the fourth letter. The government, which has said it will release a job notification calendar, has not fulfilled that promise, according to a recent letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X