• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవరత్నాల్లో ఏ రత్నం ఎప్పుడు ఊడుతుందో-రఘురామ సెటైర్లు-కిడ్నీ పేషెంట్ల ఫించనుకు కరెంట్ బిల్లుతో లింకేంటని...

|

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు. నవరత్నాలు నెమ్మదిగా రాలిపోవడానికి సిద్దంగా ఉన్న రత్నాలని ఎద్దేవా చేశారు. ఏ రత్నం ఎప్పుడు ఉంటుందో,ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అమ్మ ఒడి పథకం కింద వన్ టైమ్ ల్యాప్‌టాప్‌లు ఇచ్చి దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.రఘురామ కృష్ణరాజు శనివారం(సెప్టెంబర్ 11) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

నవరత్నాలు వైఎస్ ఛైర్మన్‌పై రఘురామ...

నవరత్నాలు వైఎస్ ఛైర్మన్‌పై రఘురామ...

వైఎస్సార్ వాహన మిత్ర పథకం కూడా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకున్నట్లుగా జరుగుతోందన్నారు. రోడ్లు సరిగా లేక,పెట్రోల్ డీజిలపై పన్ను బాదుతుండటంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నవరత్నాలకు నారాయణస్వామి అనే అధికారిని వైఎస్ ఛైర్మన్‌గా నియమించారని... ఆయన గతంలో శుభగృహ అనే కంపెనీకి సేల్స్ మేనేజర్‌గా పనిచేశారని అన్నారు.వెల్ఫేర్ స్కీమ్స్ అమలుచేసిన అనుభవం లేని వ్యక్తిని నవరత్నాలు పథకానికి వైఎస్ ఛైర్మన్ చేయడమేంటని ప్రశ్నించారు.

కిడ్నీ పేషెంట్లను నాలుగు కాలాలు బతకినివ్వండి : రఘురామ

కిడ్నీ పేషెంట్లను నాలుగు కాలాలు బతకినివ్వండి : రఘురామ

కరెంట్ బిల్లును కిడ్నీ పేషెంట్ల ఫించన్లకు ముడిపెట్టడాన్ని తప్పు పట్టారు. విద్యుత్ 300 యూనిట్లు దాటితే డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే రూ.10వేల ఫించన్‌లో కోత విధించడమేంటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని రఘురామ విమర్శించారు. కిడ్నీ పేషెంట్లు డీహైడ్రేట్ అవకుండా ఉండేందుకు ఎయిర్ కండిషనర్లు వాడుతారని... కరెంట్ బిల్లు పేరు చెప్పి వారి ఫించన్‌లో కోత విధించడం సరికాదని అన్నారు. దయచేసి కిడ్నీ పేషెంట్లను నాలుగు కాలాల పాటు బతకనివ్వండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గ్రామ వాలంటీర్ల తల్లిదండ్రులకు కూడా ఫించన్లు రద్దు చేయడం సరికాదని అన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాలంటీర్ల తల్లిదండ్రులకు ఫించన్ రద్దు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో విధంగా ఫించన్లు రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.

మటన్ మార్టులపై రఘురామ రియాక్షన్...

మటన్ మార్టులపై రఘురామ రియాక్షన్...

రాష్ట్రంలో మటన్ మార్టులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రఘురామ కృష్ణరాజు తప్పు పట్టారు. గతంలో పౌల్ట్రీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే నష్టాలతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. కొన్నింటిని పబ్లిక్‌కే వదిలేయాలని... అవసరమైతే ఆ వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక వినాయక చవితి వేడుకల్లో గవర్నర్ గానీ వైసీపీ నాయకులు గానీ ఎక్కడా కనపబడలేదన్నారు.ఓవైపు తెలంగాణలో ఘనంగా వినాయక చవితి నిర్వహిస్తే ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు.చాలాచోట్ల వినాయక విగ్రహాలను తొలగించినట్లు తనకు మెసేజ్‌లు వచ్చాయన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాలని ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.

  AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
  అన్ని మతాలను సమానంగా చూడాలని..

  అన్ని మతాలను సమానంగా చూడాలని..

  టీటీడీ నుంచి రూ.50 కోట్లు కామన్ గుడ్ ఫండ్ కింద ప్రభుత్వం తీసుకోవడాన్ని రఘురామ కృష్ణరాజు తప్పు పట్టారు. ఆ నిధులు ఇతర వాటికి మళ్లిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అర్చకులకు అర్చక వెల్ఫేర్ ఫండ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీల నుంచి వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం... ఇమామ్‌లు,మౌజీలు,చర్చి పాస్టర్‌లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి వేతనాలు ఇస్తోందన్నారు. అన్ని మతాలను ప్రభుత్వం సమ దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

  English summary
  YSRCP rebel MP Raghuram Krishnaraju has lashed out at the Andhra Pradesh government over Navratnas,and pension issues. He said navaratnas are ready to slowly fall away.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X