• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ - జగన్ మంతనాలన్న రఘురామ - దళిత రిజర్వేషన్లపై అనూహ్య వ్యాఖ్యలు

|

ఆంధ్రప్రదేశ్ లో ఒక పద్ధతి ప్రకారం భారీ ఎత్తున విదేశీ నిధులతో క్రైస్తవ మత వ్యాప్తి జరుగుతున్నదని, జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హిందూ మతంపై దాడికి పాల్పడుతోందన్న అనుమానాలున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి దళితులపై అనూహ్య వ్యాఖ్యలు చేసిన ఆయన, కేంద్ర కేబినెట్ లో చేరేందుకు వైసీపీ విశ్వప్రయత్నం చేస్తున్నదనీ చెప్పారు. రాజధాని రచ్చబడ్డ కార్యర్యక్రమంలో భాగంగా శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..తొలి కరోనా ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా - నితీశ్ నాయకత్వానికే బీహారీల పట్టం - ఒపీనియన్ పోల్ ఫలితాలివే..

దళితులుగా రిజర్వేషన్లు పొందుతూ..

దళితులుగా రిజర్వేషన్లు పొందుతూ..

‘‘చాలా రోజుల కిందట సీఎం జగన్ అన్ని మతాల గురువులకు ప్రభుత్వం తరఫున గౌరవ వేతం ప్రకటించారు. లబ్ది పొందినవాళ్లలో 33 వేలమంది పూజారులు ఉంటే, చర్చి పాస్టర్ల సంఖ్య కూడా సుమారు 30 వేలుగా ఉంది. అంటే రాష్ట్రంలో క్రైస్తవమతం ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. అధికారిక జనాభా లెక్కల ప్రకారం 1.6 శాతంగా ఉన్న క్రిస్టియన్లకు ఇన్ని చర్చిలు ఎలా ఉన్నాయి? ఓ వైపు హిందూ దళితులుగా రిజర్వేషన్లు పొందుతోన్న లక్షలాది మంది.. చర్చిలకు పోతుండటం వల్లే వాటి సంఖ్య ఇంతలా పెరిగింది. మత మారిన దళితులు బీసీలు అవుతారే తప్ప, ఎస్పీలు కాబోరు. వాళ్లంతా రిజర్వేషన్లు పొందడం రాజ్యంగ విరుద్ధమే అవుతుంది..

నాపై దళిత క్రిస్టియన్ల దాడి..

నాపై దళిత క్రిస్టియన్ల దాడి..

ఇలా క్రిస్టియన్లు, ఆఖరికి చర్చిల పాస్టర్లు కూడా ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్నారు. చర్చిలకు పోతూ, ఇంట్లో క్రీస్తు ఫొటోను పెట్టుకున్న చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎస్సీ రిజర్వుడు స్థానాల నుంచి పదవులు అనుభవిస్తున్నారు. దీని వల్ల నిజమైన హిందువులకు, అంటే, దళిత హిందువులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇవన్నీ మాట్లాడుతున్నందుకు నాపై దళిత క్రిస్టియన్లతో చేత దాడి చేయించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. దళిత హిందువులందరూ నేను చెప్పే విషయాలు నిజమేనని ఒప్పుకుంటారు. హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్ల వల్లే అసలు సమస్య..

కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడుకిమ్ జోంగ్ ఉన్ మరో సంచలనం - జీవితంలో తొలిసారి సారీ - అదికూడా బద్ధశత్రువుకు చెప్పాడు

నలంద కిషోర్ లాగా లేపేస్తారనే..

నలంద కిషోర్ లాగా లేపేస్తారనే..

జనాన్ని నమ్మించడంలో జగన్ కు ఉన్నంత తెలివి నాకు లేకపోవచ్చు. కానీ ఎదుటివాళ్లను అంచనావేయడంలో నాకూ సామర్థ్యం ఉంది. మా పార్టీ వాళ్లు చాలా మంది వరుసగా నాపై బెదిరింపులకు దిగుతున్నారు. నా అంచనా నిజమైతే ఒకటిరెండు రోజుల్లో నా నియోజకవర్గంలోనే నా ఆఫీసుపై హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లు దాడి చేస్తారు. నలంద కిషోర్ లాగా లేపేస్తారన్న అంచనా ఉందికాబట్టే నేను కేంద్రం సెక్యూరిటీ కోరాను. దళితుల పట్ల జగన్ ది, వైసీపీది కపట ప్రేమ. సీఎం తిరుపతి వెళ్లినా, దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, పార్లమెంటులో సంతాపతీర్మానానికి వైసీపీ ఎంపీలు హాజరుకాకపోవడమే అందుకు నిదర్శనాలు'' అని ఎంపీ రఘురామ అన్నారు. మరోవైపు..

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ?

కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ?

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ లో చేరేందుకు వైసీపీ తీవ్రంగా యత్నిస్తున్నదని రెబల్ ఎంపీ రఘురామ చెప్పారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశంపై మంతనాలు జరిగాయని, అందుకు బీజేపీ సైతం సానుకూలంగా స్పందించినట్లుగా వార్తలు వచ్చాయన్నారు. అయితే తన అంచనా ప్రకారం.. హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న వైసీపీని బీజేపీ దగ్గరికి తీసే పరిస్థితి ఉండబోదన్నారు. అదీగాక, వైసీపీ నేరుగా న్యాయవ్యవస్థలపై దాడులు, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై దూషణలకు పాల్పడుతున్నందున కేబినెట్ లో చోటు అంత సులువు కాదని రఘురామ అన్నారు.

English summary
narasapuram ysrcp rebel mp raghurama krishnam raju once again slams andhra pradesh cm ys jagan and ysrcp. the rebel also said that ysrcp is trying to join in union cabinet. he claims, may dalith cristians in ap having sc certificates and ysrcp wantedly promoting christianity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X