వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మద్యం తాగితే రెండు,మూడేళ్లలో హరీ అంటారట.. ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీలో మద్యం అమ్మకాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో మద్యం విక్రయాలపై స్పందించిన ఆయన ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారు అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే మద్యం తాగితే రెండు మూడేళ్లలోనే చనిపోయే ప్రమాదం ఉందంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

శిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చశిరోముండనం కేసులో సీఎం సమీప బంధువు .. రాజధానిపై మింగ మెతుకు లేకున్నా... రఘురామ రచ్చ

ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు ఒక్క ఏపీలోనే

ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లు ఒక్క ఏపీలోనే

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో అమ్ముతున్న కొత్త, కొత్త మద్యం బ్రాండ్లను గురించి మాట్లాడుతూ ఆ ఐడియాలు ఎలా వస్తాయో అర్థం కాలేదని, మద్యం బ్రాండ్ లకు పేర్లు ఎవరు పెడుతున్నారో, వాటి నాణ్యత ఏమిటో, వాటి రేట్లు ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. పేరున్న బ్రాండ్లను పక్క రాష్ట్రాల్లో అమ్ముతుంటే, ఏపీలో మాత్రం గోల్డ్ మెడల్ ,సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ,నోబెల్ ప్రైజ్ వంటి చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టి వాటిని బ్రాండ్లు గా అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఊరు, పేరు లేని బ్రాండ్లను తాగడం మానేయండి అంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి

ఊరు, పేరు లేని బ్రాండ్లను తాగడం మానేయండి అంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి

పక్క రాష్ట్రాల్లో దొరికే లిక్కర్ తాగితే 20 ఏళ్లలో లివర్ చెడిపోతుందని భావిస్తే, ఏపీలో దొరికే లిక్కర్ తాగితే మాత్రం రెండు మూడేళ్లలోనే హరి అంటారని చాలా మంది చెబుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ రుచి చూడలేదని, ఇది ప్రజలు అనుకుంటున్న మాట అంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ఒకే కంపెనీలో తయారవుతున్న వివిధ మద్యం బ్రాండ్ లు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు . ఊరు, పేరు లేని బ్రాండ్లను తాగడం మానేయండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మాయదారి మద్యం బ్రాండ్ల గురించి సీఎం వైఎస్ జగన్ కు కూడా తెలియదన్న రఘురామ

మాయదారి మద్యం బ్రాండ్ల గురించి సీఎం వైఎస్ జగన్ కు కూడా తెలియదన్న రఘురామ

మాయదారి మద్యం బ్రాండ్ల గురించి సీఎం వైఎస్ జగన్ కు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. మద్యం బ్రాండ్ల విషయంలో విచారణ జరిపించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు రఘురామ . ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం అంటున్న ప్రభుత్వం దానిని పూర్తిగా అమలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త కొత్త బ్రాండ్ లను తీసుకువచ్చి ప్రజల ఆయుష్షును తగ్గించవద్దు అంటూ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 ఏపీ ప్రభుత్వానికి మద్యంతో వచ్చిన డబ్బంతా ఆ స్కీముల నుండేనా ?

ఏపీ ప్రభుత్వానికి మద్యంతో వచ్చిన డబ్బంతా ఆ స్కీముల నుండేనా ?

మద్యంతో ప్రభుత్వానికి 22వేల కోట్ల రాబడి వచ్చినట్లుగా తెలుస్తోందన్న ఆయన ఇదంతా ప్రజాధనం అయినా అయి ఉండాలి. లేదా వివిధ సంక్షేమ పథకాల ద్వారా జగనన్న స్కీమ్ ల్లో నుంచి ప్రజలకు అందిన డబ్బైనా అయ్యుండాలి అంటూ మాట్లాడారు. అమ్మ ఒడి, జగనన్న చేయూత ,వైఎస్సార్ నేస్తం వంటి అనేక పథకాల ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తుంటే ఆ డబ్బే మళ్ళీ ప్రభుత్వానికి మద్యం ఆదాయంగా వచ్చిందేమో అని పేర్కొన్నారు సీఎం జగన్ ఇప్పటికైనా ఏపీలో లిక్కర్ బ్రాండ్ల విషయంలోదృష్టి సారించి ప్రజల ప్రాణాలకు హానికరమైన లిక్కర్ బ్రాండ్ల నుండి ప్రజలను కాపాడాలని కోరారు.

English summary
Narasapuram MP Raghurama Krishnamraju made shocking comments on liquor sales in AP as a Delhi venue. Responding to liquor sales on the AP, he was incensed that there was selling weird brands that were nowhere to be found. He made shocking comments that there is a risk of death in two to three years if people drink alcohol made in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X