• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైఎస్ జగన్ అవినీతిలో హీరో .. అభివృద్ధిలో జీరో ; ప్యాలెస్ దాటి బయటకు రావాలన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

|
Google Oneindia TeluguNews

విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకుని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ తో పాటుగా, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమదాలవలస పోలీస్ స్టేషన్ నుంచి విడుదల తర్వాత బయటకు వచ్చిన రామ్మోహన్ నాయుడు,కూన రవికుమార్ లు జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

జగన్ సర్కార్ చేస్తుంది ఆర్ధిక నేరం

జగన్ సర్కార్ చేస్తుంది ఆర్ధిక నేరం


రెండున్నర ఏళ్ల పాలనలో వైయస్ జగన్ అభివృద్ధిలో జీరో.. అవినీతిలో హీరో అంటూ రామ్మోహన్ నాయుడు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని రామ్మోహన్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల నుండి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి అవే డబ్బులను నవరత్నాల కోసం ఖర్చు చేస్తున్నారని, జగన్ సర్కార్ చేస్తున్నది పెద్ద స్కామ్ అని, అతి పెద్ద ఆర్థిక నేరమని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

 టీడీపీ అంటేనే భయపడుతున్న వైసీపీ, జగన్

టీడీపీ అంటేనే భయపడుతున్న వైసీపీ, జగన్

తెలుగుదేశం పార్టీ అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేతలు, సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి అడ్డుగా పెట్టుకుని లక్షల కోట్ల స్కాం లు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. జగన్ సర్కార్ టిడిపికి భయపడుతుందని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనలను అడుగడుగునా అడ్డుకోవడమే నిదర్శనమని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. టిడిపి నేతలను అడ్డుకునే బదులు పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెడితే బాగుంటుందని, మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోవటంపై దృష్టి పెడితే రమ్య హత్యోదంతం వంటి ఘటనలు జరగవు కదా అంటూ రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 తండ్రి సమయంలో సంపాదించిన డబ్బు సరిపోక మళ్ళీ జగన్ దోపిడీ

తండ్రి సమయంలో సంపాదించిన డబ్బు సరిపోక మళ్ళీ జగన్ దోపిడీ

ఆర్థిక ఉగ్రవాదులు ఎంతమంది వచ్చినా, సామాన్య ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ చేసే ఆందోళనలకు మాత్రమే కరోనా నిబంధనలు వర్తిస్తాయా? వైయస్సార్ పార్టీ కండువా కప్పుకున్న నేతలకు కరోనా నిబంధనలు వర్తించవా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రి వైయస్సార్ సమయంలో సంపాదించిన డబ్బు వైయస్ జగన్ కు సరిపోలేదని, అందుకే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోచుకునే పని మొదలుపెట్టారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే చరమగీతం పలుకుతామని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా నిర్బంధించినా టిడిపి నేతలు రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై సమరం చేస్తూనే ఉంటారని రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు.

  NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
   నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ ర్యాలీ.. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవి అరెస్ట్

  నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ ర్యాలీ.. ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవి అరెస్ట్

  ఇదిలా ఉంటే ఈరోజు ఆమదాలవలస లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయగా, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు ఎంపీ రామ్మోహన్ నాయుడును, కూన రవికుమార్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

  English summary
  TDP MP Rammohan naidu was furious on Jagan's rule in AP. Zero in the development of YS Jagan during the two and a half year rule .. Rammohan Naidu was outraged that Jagan is a hero in corruption. CM Jagan demanded to step out beyond the palace. Critics say anarchy continues in the state. Rammohan Naidu urged the government to immediately reduce the prices of essential commodities. Rammohan Naidu has criticized the Jagan government for collecting taxes from the people and spending the same money on Navratnas, saying it was a big scam and a heinous financial crime.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X