చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీపై ఎంపీ శివప్రసాద్ తీవ్ర విమర్శలు, నంది అవార్డుల విమర్శలపై ఇలా

narendra modi, chittoor, siva prasad, naramalli sivaprasad, telugudesam, chandrababu naidu, nandi awards, చిత్తూరు, శివప్రసాద్, నారమల్లి శివప్రసాద్, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నేత, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడున్నరేళ్లుగా ఏమీ మాట్లాడకుండా ఈ పార్లమెంటులో ఎందుకు ఉన్నామా అనేలా పరిస్థితులు ఉన్నాయన్నారు.

చదవండి: బాబు నాకు ఎలా అంటే, ఆ రోజు అందుకే విమర్శించా, ఫోన్ చేశానని తెలిస్తే చాలు: శివప్రసాద్

ఎందుకంటే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తమకు మిత్రపక్షం అయిపోయిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చెయ్యరని విమర్శించారు. విస్తరాకు మాత్రం ముందు పెడతాడని, అందులో ఏమీ ఉండవన్నారు. మేం ఆ విస్తరాకు చూసుకుంటూ ఉండాలన్నారు.

MP Siva Prasad responds on PM Modi and Nandi Awards

అలాంటప్పుడు మేం బయటకు రావొచ్చు కదా అని అడుగుతారని, కానీ ఒక పద్ధతి ఉందని, సీఎం చంద్రబాబు ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని ఒడ్డున పడెయ్యాలని చూస్తున్నారని చెప్పారు.

ఊరికే బయటకు వస్తే ఏముంటుందన్నారు. చంద్రబాబుకు ఓపిక ఎక్కువ అన్నారు. తమను కూడా ఏమీ మాట్లాడవద్దని చెబుతున్నారని, ఆయనకు సహనం ఎక్కువ ఉందని, చాలా ఓపిక పడతాడని ప్రశంసించారు.

నంది అవార్డుల వివాదంపై కూడా శివప్రసాద్ స్పందించారు. ఓసారి జ్యూరీ అవార్డులు ఇచ్చేసిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదన్నారు. తామంతా కూడా సినిమాలు తీశామని, పోటీలకు పంపించామని చెప్పారు. రావాల్సిన సినిమాకు అవార్డు రాలేదని, అప్పుడు మేం కూడా ప్రెస్ మీట్లు పెట్టి గోల చెయ్యలేదన్నారు.

English summary
Chittoor MP Siva Prasad on Monday responded on Prime Minister Narendra Modi and Nandi Awards in an intenrview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X