వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014లోనే జగన్ సీఎం కావల్సింది: ఎందుకు కాలేదో చెప్పిన ఎంపీ సుజనా చౌదరి

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోనే జగన్ సీఎం కావాల్సింది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజనా జగన్, చంద్రబాబుపై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

2014 ఎన్నికల్లోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సి ఉందని, జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సింది అని వ్యాఖ్యానించిన బిజెపి ఎంపీ సుజనాచౌదరి ఆ సమయంలో జగన్ సీఎం ఎందుకు కాలేదో వివరించారు.

'క్షమించాలి.. మూసేశాం! నో 'పవర్'': జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు'క్షమించాలి.. మూసేశాం! నో 'పవర్'': జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

బిజెపి, పవన్ కళ్యాణ్ రూపంలో

బిజెపి, పవన్ కళ్యాణ్ రూపంలో

2014వ సంవత్సరంలో ఎన్నికల సమయంలో జగన్ కు సానుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీకి సహకరించటం వల్లే జగన్ పార్టీ ఓటమి పాలైందని పేర్కొన్నారు. బిజెపి, పవన్ కళ్యాణ్ రూపంలో జగన్‌ పార్టీకి ఎదురు దెబ్బతగిలిందని చెప్పిన సుజనాచౌదరి అది టీడీపీకి కలిసొచ్చి జగన్ కు అధికారం దూరం అయిందన్నారు. ఇక సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు బిజెపి, పవన్ కళ్యాణ్ సహకారం లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు అన్న ధోరణి లో సాగింది. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న టీడీపీకి నాడు బీజేపీ, పవన్ వలన అధికారం దక్కిందన్నారు సుజనా చౌదరి.

భారతీయ జనతా పార్టీలో చేరేవాడినని

భారతీయ జనతా పార్టీలో చేరేవాడినని

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోవడం, జనసేన పార్టీ స్వయంగా రంగంలోకి దిగటం తన వల్లే టీడీపీకి ఈ గతి పట్టిందన్నారు ఎంపీ సుజనా చౌదరి. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినా కూడా తాను టీడీపీలో ఉండే వాడిని కాదని, తాను భారతీయ జనతా పార్టీలో చేరేవాడినని సుజనా పేర్కొన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు బీజేపీతో వైరం అనర్ధాలు తెస్తుందని తాను ముందే చెప్పానని, అయినా ఆయన మాట వినిపించుకోలేదని సుజనా పేర్కొన్నారు.

దేశం అభివృద్ధివైపు దూసుకుపోతుందని

దేశం అభివృద్ధివైపు దూసుకుపోతుందని

బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగించాలని అనుకున్న వారిలో తానూ కూడా ఒకడినన్నారు సుజనా చౌదరి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధివైపు దూసుకుపోతుందని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు . టీడీపీతో రాజకీయ జీవితం ఆరంభించిన సుజనా ఇటీవల బీజేపీలో చేరిన తరువాత అటు టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
BJP MP Sujana chowdary, who commented that YS Jaganmohan Reddy should be the CM in the 2014 elections and that the Jagan-led YSRCP should come to power, explained why Jagan was not CM at the time. Sujana chowdary, who said that the Jagan party had suffered a setback in the form of BJP and Pawan Kalyan, had joined the TDP . In 2019, the BJP not supported, and the Janasena party competes itself, so, the TDP lost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X