India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరేయ్ బోకేషూ.. టీడీపీ బోకు.. పోరంబోకు కుక్కలు: బర్రెలా ఊరిమీద పడ్డావు: సాయిరెడ్డి ఫ్రస్ట్రేషన్

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు చేయడం, ఒకరినొకరు బూతులు తిట్టడం ప్రస్తుత ఏపీ రాజకీయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతల బూతుల పర్వం ఏపీ ప్రజలలో విస్మయాన్ని కలిగిస్తోంది. బ్రోతల్ హౌస్ లు, బ్రోకర్లు, బోకేష్ , ఇలా నోటికొచ్చిన తిట్లు తిట్టటం ప్రజల్లో చర్చకు కారణంగా మారింది. తాజాగా వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన లోకేష్ పై, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.

నీ వైసిపి కుక్కల్ని పంపడం కాదు జగన్ రెడ్డి స్వయంగా నువ్వేరా అన్న లోకేష్


లోకేష్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉందని వ్యాఖ్యలు చేశారు. తనలో తానే మాట్లాడుకోవడం, గాలిలో సైగలు చేసుకోవడం, ఏ కారణం లేకుండా నవ్వుకోవడం, లండన్ మందులు పనిచేయడం లేదు అనుకుంటా అంటూ జగన్ ను టార్గెట్ చేశారు. అంతేకాదు పదో తరగతి పాస్ పర్సంటేజీ ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా లో నే చర్చించుకుందాం అంటూ నీ వైసిపి కుక్కల్ని పంపడం కాదు జగన్ రెడ్డి స్వయంగా నువ్వేరా తేల్చుకుందామని లోకేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు.. ఒరేయ్ బోకేష్ అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

టీడీపీ పోరంబోకు కుక్కలను ఉసిగొల్పుతూ శునకానందం పొందుతున్నావు: సాయిరెడ్డి పంచ్

టీడీపీ పోరంబోకు కుక్కలను ఉసిగొల్పుతూ శునకానందం పొందుతున్నావు: సాయిరెడ్డి పంచ్

ఒరేయ్ బోకేషూ... ప్రజల గుండెల్లో స్థానం పొందాలంటే 'బూతుల బురద' పారించడం కాదురా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు . ఉస్కో అంటూ టీడీపీ బోకు-పోరంబోకు కుక్కలన్నింటినీ ఉసిగొల్పావు. అవి మొరుగుతుంటే శునకానందం పొందుతున్నావు అని మండిపడ్డారు. బంధం తెంచుకున్న బర్రెలా ఊరి మీద పడితే చివరకు నువ్వు చేరేది బందెల దొడ్లోకేరా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ప్రస్టేషన్ అంతా తన వ్యాఖ్యల్లో చూపించారు.

వెంట్రుక పీకలేరు అంటూ బిల్డప్ దేనికని జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్


అంతేకాదు జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహమా ... మీడియా ని చూస్తే భయపడతాడు, సోషల్ మీడియా అంటే వణుకు పుడుతుంది, చివరికి యూట్యూబ్ ఛానల్ థంబ్ నైల్ చూసినా జడుచుకుంటారు అంటూ వ్యాఖ్యలు చేసిన లోకేష్, జగన్ ను పిరికివాడు అంటూ పేర్కొన్నారు. ఈ మాదిరి పిరికోడికి పిల్లల ముందు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ జగన్ బిల్డప్ దేనికి అని ప్రశ్నించారు నారా లోకేష్.

ఎవరు కలలో కనిపిస్తేభయంతో పక్క తడిసిపోతుందో నీ బాబును అడగమన్న సాయిరెడ్డి

ఎవరు కలలో కనిపిస్తేభయంతో పక్క తడిసిపోతుందో నీ బాబును అడగమన్న సాయిరెడ్డి


దీనికి సమాధానంగా ఒరేయ్ పిల్ల కాకి. నీ బాబును అడుగు. ఎవరు కలలో కనిపిస్తేభయంతో పక్క తడిసిపోతుందో. ఆ రోజు జూమ్ మీటింగ్ నుంచి మధ్యలో పారిపోయావు అంటూ ఎద్దేవా చేశారు. జడుపుకి వారం రోజులు చలి జ్వరం పట్టింది. బచ్చాగాడివి నీకెందుకురా. జగన్ గారి గురించి మాట్లాడితే మెదడేమి పెరగదు. 7th-8th క్లాస్IQ లెవల్ గాడివి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి.

English summary
YSRCP MP Vijayasai Reddy's frustration went to peaks. MP Vijaya sai reddy attacked Lokesh with abusive remarks called lokesh as bokesh and tdp leaders as street dogs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X