బాబు వెన్నులో జలదరింపు; వెంట్రుకతో కొండను లాగే యత్నం: పొత్తులపై విడిచిపెట్టని సాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పొత్తుల కోసం వ్యూహాలు రచిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరని, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే పొత్తులు లేకుంటే సాధ్యం కాదని చంద్రబాబు భావిస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు.

చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి
ఇక
పవన్
కళ్యాణ్
బీజేపీతో
పొత్తులతో
ముందుకు
వెళతాడా?
లేక
టీడీపీతో
పొత్తు
పెట్టుకుంటాడా
అన్నది
స్పష్టం
చేయాలని
కూడా
ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు
పరపతి
పొత్తు
లేకుంటే
గెలేవలేము
అన్న
వ్యాఖ్యలతో
పలుచనబడిపోయిందని
ఆయన
ఎద్దేవా
చేశారు.
తాజాగా
మరోమారు
చంద్రబాబు
ని
టార్గెట్
చేసిన
విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో
తాజా
పరిణామాలతో
బాబు
వెన్నులో
జలదరింపు
స్పష్టంగా
కనిపిస్తోంది
అంటూ
వ్యాఖ్యలు
చేశారు.

151 సీట్లు గెలిచిన పర్వతాన్ని ఢీ కొట్టలేమని బాబు గ్యాంగ్ కు అర్థమైంది
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా పొత్తుల కోసం అప్పుడే ఆరాటాలు మొదలయ్యాయి అని పేర్కొన్నారు. గుంపు కట్టకపోతే 151 సీట్లు గెలిచిన పర్వతాన్ని ఢీ కొట్టలేమని బాబు గ్యాంగ్ కు అర్థమైంది అంటూ సెటైర్లు వేశారు. అందుకే వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నాలు మొదలెట్టారు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఎవరు ఎలా వచ్చినా, ఎన్ని పొత్తులతో వచ్చినా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

జాతి పార్టీలతో జత కడతారో జాతీయ పార్టీలతో కలుస్తారో అది మీ ఇష్టం
సింగల్ గా వస్తారో వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం అంటూ వెల్లడించారు. వైసీపీ మాత్రం సింగిల్ గానే ప్రజలతో మింగిల్ అవుతుంది అని పేర్కొన్నారు. ప్రజల మద్దతు పొందిన పార్టీ కాబట్టి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచి తీరుతుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి జాతి పార్టీలతో జత కడతారో జాతీయ పార్టీలతో కలుస్తారో అది మీ ఇష్టం. మా అధినేత మాత్రం ఎప్పటికీ జనంతోనే మమేకమవుతారు అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయని అందుకే ఆయన సింగిల్ గా పోటీ చేసినా విజయం సాధించి తీరుతారు అని స్పష్టం చేశారు.

ప్రగల్భాలు పరమ రోతగా అనిపించడం లేదా బాబూ?
అంతే కాదు 'నా తుపాకీలో గుండ్లున్న రోజుల్లో గువ్వను కొట్టా, కొంగను వేశా' అన్న ప్రేలాపనలు తప్ప వర్తమానంలో ఏం చేస్తున్నాడో చెప్పడు చంద్రబాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రగల్భాలు పరమ రోతగా అనిపించడం లేదా బాబూ? అంటూ ప్రశ్నించారు. కుప్పం ప్రజలు మొఖం మీదే కొట్టి చెప్పారు కదా! ఇంకెన్ని తీర్పులు కావాలి? అని విజయసాయి రెడ్డి గతంలో జరిగిన ఎన్నికల తీర్పులను గుర్తు చేశారు. జనం నిన్ను ఎప్పుడో మర్చిపోయారు చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు.