వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల అవినీతిపై విజయసాయి ఫైర్..అద్దె పేరుతో కోట్లు లూటీ చేశారని మండిపాటు

|
Google Oneindia TeluguNews

విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద, టీడీపీ నాయకుల ట్విట్టర్ వేదికగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై సంచలన ఆరోపణలు చేశారు.

కేశినేని నానీతో గల్లా జయదేవ్ భేటీ ... బుజ్జగించే యత్నంకేశినేని నానీతో గల్లా జయదేవ్ భేటీ ... బుజ్జగించే యత్నం

కోడెల శివప్రసాద్ స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు.. 4.5 కోట్లు లూటీ చేశారన్న విజయసాయి

కోడెల శివప్రసాద్ స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు.. 4.5 కోట్లు లూటీ చేశారన్న విజయసాయి

స్పీకర్ పదవికి ఆయన కళంకం తెచ్చారని , ఒక స్పీకర్ గా అయన ఆ పదవికి మచ్చ తెచ్చారని పేర్కొన్నారు . ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేశారని విజయసాయి ఆరోపించారు.ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే చేటు చేశారని ఆయన పేర్కొన్నారు . ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారని పేర్కొన్నారు. చ.అడుగుకు రూ.16 అద్దె. పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారు. నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారంటూ ట్వీట్ చేశారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తనను నియమించినందుకు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు విజయసాయి ధన్యవాదాలు తెలిపారు.అలాగే లోక్‌సభాపక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డి, చీఫ్ విప్ మార్గాని భరత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

గత ప్రభుత్వ హహయాంలో అవినీతి లెక్కలు తీస్తున్న విజయసాయి ..

గత ప్రభుత్వ హహయాంలో అవినీతి లెక్కలు తీస్తున్న విజయసాయి ..

మొన్నటికి మొన్న ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ? అంటూ ట్వీట్ చేసిన విజయసాయి రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో తరిమారని ఏడ్చి పెడబొబ్బలు పెట్టిన వ్యక్తి దుబారా ఖర్చులు చూడండి. ఉన్నత విద్యామండలిలో నలుగురి డ్రైఫూట్స్ ఖర్చు18 లక్షలంట. విజనరీ, అనువజ్ణుడు, అభివృద్ధి పదగామి అని కుల మీడియా కీర్తించింది ఈయననే అంటూ గత ప్రభుత్వ అవినీతి లెక్కలు తీయటంలో బిజీగా ఉన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి .

దొంగ ఏడుపులు వద్దు.. యువ సీఎం కు అన్నీ తెలుసు అన్న విజయసాయి

దొంగ ఏడుపులు వద్దు.. యువ సీఎం కు అన్నీ తెలుసు అన్న విజయసాయి

అంతే కాదు కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయి. దొంగ ఏడుపులు వద్దు. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసు. కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంది. అంటూ ట్వీట్ చేశారు విజయసాయి .

English summary
The YSRCP MP V Vijayasai Reddy commented that the TDP leader Kodela Siva Prasada Rao has brought the black spot to the Speaker post.Through the twitter post, MP Vijayasai Reddy tweets that My heartfelt thanks to the party president and Chief Minister YS Jagan Mohan Reddy for appointing me as parliamentary party leader.He also congratulated MP Midhun Reddy over appointing as YSRCP floor leader in Lok Sabha, and Rajahmundry MP Margani Bharat Ram as the party chief whip.In another tweet, MP said that by looting the public money, Kodela Siva Prasada Rao has brought the black spot to the Speaker's post.He said Kodela has placed, Aarogyasri, Employee's health scheme, and Pharmacy Council offices in his own building which has no minimum facilities.For these offices, Kodela has collected the rent of Rs 16 per square feet, and later with recommendations, he got it increased to Rs 25 per square feet. In this way, Kodela Siva Prasada has looted more than 4.5 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X