చంద్రబాబు నిప్పు.. అందుకే కోనసీమలో చిచ్చు: ఆత్మకూరు ఉపఎన్నికపైనా వదిలిపెట్టని సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్ల పై రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే జగన్ దావోస్ టూర్ కు, కోనసీమ అల్లర్లకు ముడిపెట్టి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరోమారు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోనసీమ అల్లర్లపై, ఆత్మకూరు ఉపఎన్నికపై బాబును టార్గెట్ చేశారు.

చంద్రబాబు నిప్పు... ఒప్పుకుంటారా ? సాయిరెడ్డి సెటైర్
రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోస్లో జగన్ అడుగులు వేస్తుంటే, మరోవైపు తమకు రాజకీయ భవిష్యత్తు లేదని ఏపీలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అందులో భాగంగానే కోనసీమలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు, ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై ప్రతిపక్షాలు దాడులు చేశాయని విమర్శించారు. చంద్రబాబు చాలాసార్లు తాను నిప్పు అని చెప్పిన వ్యాఖ్యలను తిరిగి మళ్ళీ చెప్పిన విజయసాయిరెడ్డి అంబేద్కర్ పేరు వద్దని బస్సులు, దళిత మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళు తగలబెట్టించారు చంద్రబాబు అంటూ ఆరోపించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా చంద్రబాబు నిప్పు అని అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబును టార్గెట్ చేశారు.

ఆత్మకూరు ఉపఎన్నిక విషయంలో చంద్రబాబును టార్గెట్ చేసిన సాయిరెడ్డి
ఇక
ఆత్మకూరు
ఉపఎన్నిక
నెల్లూరు
జిల్లా
ఆత్మకూరు
అసెంబ్లీ
నియోజకవర్గానికి
మేకపాటి
గౌతమ్
రెడ్డి
హఠాన్మరణంతో
ఉప
ఎన్నిక
జరగనుంది.
దీంతో
ఉపఎన్నిక
షెడ్యూల్
విడుదలైంది.
ఈ
క్రమంలో
అధికార
వైసీపీ
నుండి
మేకపాటి
గౌతమ్
రెడ్డి
సోదరుడు
విక్రమ్
రెడ్డి
ఎన్నికల
బరిలోకి
దిగనున్నారు.
దీంతో
ఆత్మకూరు
అసెంబ్లీ
ఉప
ఎన్నికపై
ఆసక్తికరమైన
పోస్ట్
చేశారు
వైసీపీ
ఎంపీ
విజయసాయి
రెడ్డి.
జూన్
23వ
తేదీన
పోలింగ్
అంటూ
పేర్కొన్న
విజయసాయిరెడ్డి
నిను
వీడని
నీడను
నేనే
అంటూ
23
చంద్రబాబు
వెంట
పడుతుందని
వ్యాఖ్యానించారు.

సామాజిక న్యాయభేరి బస్సుయాత్రపైనా సాయిరెడ్డి వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో చంద్రబాబు 23 స్థానాలకే పరిమితం అయ్యారు అని గుర్తుచేశారు. ఇక అంతేకాదు అచ్చెన్నాయుడు మన పార్టీకి జనాలు బీభత్సంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారుగా.. పోటీ చేద్దామా అంటూ ప్రశ్నించినట్టు నాకౌట్ పోస్టు పెట్టారు. అంతేకాదు వైయస్సార్సీపి సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ఈ రోజు ప్రారంభమైందని పేర్కొన్న విజయసాయిరెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. వైఎస్ జగన్ అమలు చేసిన,చేస్తున్న సామాజిక న్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రజల్లోకి వస్తున్నారు అంటూ మరో పోస్టు పెట్టారు. జగన్ తన పాలనలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానాన్ని ఇచ్చారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.