• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు పిట్టల దొర; దావోస్ వెళ్లి చేసిందిదే.. అయ్యన్నకు మెంటల్: సాయిరెడ్డి వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు ను, టిడిపి నేతలను వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ దావోస్ పర్యటన పై విమర్శలు గుప్పిస్తుంటే, గతంలో చంద్రబాబు చేసిన దావోస్ పర్యటన పై విజయ్ సాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో చంద్రబాబు దావోస్ పర్యటనలో రాష్ట్రం పరువు తీసి వచ్చారంటూ అక్కడ ఒక మెస్ నడిపి వచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

దావోస్ వెళ్లి చంద్రబాబు చేసిందిదే: సాయిరెడ్డి సెటైర్

దావోస్ వెళ్లి చంద్రబాబు చేసిందిదే: సాయిరెడ్డి సెటైర్

తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడిన విజయసాయిరెడ్డి దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రంపరువు తీసొచ్చాడని మాత్రంఅర్థమవుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్దాలు చెబుతున్నాడు చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి 2016-19 మధ్య రాష్ట్రంలో లక్షా 44 వేల 703 నేరాలు నమోదైనట్టు ఎన్సీఆర్బీ వెల్లడించిందని తెలిపారు

దావోస్ తో పాటు ఆ టూర్ల ఖర్చుల లెక్క తీస్తాం : సాయిరెడ్డి

దావోస్ తో పాటు ఆ టూర్ల ఖర్చుల లెక్క తీస్తాం : సాయిరెడ్డి

దావోస్ సదస్సులకు ఎగబడి వెళ్లిన బాబు, లోకేశ్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆ పర్యటనలకు వీళ్లు పెట్టిన ఖర్చెంతో ప్రభుత్వం ఎలాగూ లెక్క తీస్తుంది అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. 2019 జనవరిలో దావోస్ సదస్సు తర్వాత లోకేశ్ టీం10 రోజులు అమెరికాలో తిరిగొచ్చింది. దాని సంగతీ తేలుస్తాం అంటూ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. అంతే కాదు విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే ఏడుపు, బీసీలకు రాజ్యసభ సీట్లు ఇస్తే ఏడుపు, పెట్టుబడుల కోసం దావోస్ వెళితే ఏడుపు అంటూ చంద్రబాబు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా ఏడుస్తున్నారు అంటూ సెటైర్ వేశారు.

వర్తమాన రాజకీయ చరిత్రలో జగన్ కు స్థానం

వర్తమాన రాజకీయ చరిత్రలో జగన్ కు స్థానం


ఒంటిరిగా సైన్యాన్ని నడిపించి అఖండ విజయాలు సాధించిన పరాక్రమవంతులు ఏడుగురు అని ప్రపంచ చరిత్ర చెబుతోంది. వారిలో అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక చక్రవర్తి, మహారాణా ప్రతాప్ కూడా ఉన్నారు. పొత్తుల్లేకుండా పోరాడి గెలిచిననాయకుడిగా జగన్ గారూ వర్తమాన రాజకీయ చరిత్రలో నిలుస్తారు అంటూ విజయసాయిరెడ్డి మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా రాష్ట్రంలో ముందుకు వెళుతున్నారని కానీ చంద్రబాబు పొత్తు లేకుండా ముందుకు వెళ్లలేక పోతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ సార్వత్రిక విజయానికి మూడేళ్ళు అయితే చంద్రబాబు ఘోర పరాజయానికి మూడేళ్లు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు పిట్టల దొర.. అయ్యన్న మెంటల్ కండీషన్ ఆందోళనకరం

చంద్రబాబు పిట్టల దొర.. అయ్యన్న మెంటల్ కండీషన్ ఆందోళనకరం


చంద్రబాబు తాను తిరగని దేశం లేదని, తనకు తెలియని భాష లేదని పిట్టలదొరలా మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక ఎన్టీఆర్ 100 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతామని పేర్కొన్న చంద్రబాబును ఉద్దేశించి వెన్నుపోటు అనే ప్రస్తావన వస్తే ఇంకో 100 తరాలు మీ పేరు చెబుతారు బాబు అంటూ పొలిటికల్ పంచ్ వేశారు. అయ్యన్నపాత్రుడుని వదిలి పెట్టకుండా టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది అంటూ వ్యాఖ్యానించారు. మెదడుకి నాలుకకు మధ్య 'హుందాతనం' అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు అని విరుచుకుపడ్డారు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

English summary
Vijayasai Reddy said that Chandrababu had gone to Davos and tarnished the image of state. Saireddy satires that ayyannapatrudu's mental condition is alarming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X