• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది కానీ ఎన్టీఆర్ వెన్నుపోటు మాత్రం గుర్తుంటుంది: విజయసాయి రెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి నాడు కూడా తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై విజయ సాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్‌ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా

యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్‌ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా

యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్‌ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం అంటూ పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు వచ్చినకరోనా తగ్గిపోతుందిగానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మరో మారు గుర్తు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

పూర్తిగా దిగజారిపోయిన బాబు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తట్టుకోలేడు

పూర్తిగా దిగజారిపోయిన బాబు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తట్టుకోలేడు

ఇక ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన విజయ సాయి రెడ్డి పూర్తిగా దిగజారిపోయిన బాబు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తట్టుకోలేడు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గుళ్లను ధ్వంసం చేయించాడని మండిపడ్డారు. పాతకక్షలతో హత్య జరిగితే అక్కడ వాలిపోయి అలజడి సృష్టించాలని చూసి అభాసుపాలయ్యాడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఇప్పుడు మహానేత విగ్రహాలను మాయం చేయడం కొత్త ఎత్తుగడ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు విజయసాయిరెడ్డి. 40 ఏళ్ల అనుభవాన్ని నీచపు పనులకు వినియోగిస్తే ఎలా బాబూ? అంటూ చంద్రబాబును విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు.

బాబు గ్యాంగు దీనిపై ఎలా స్పందిస్తుందో?

బాబు గ్యాంగు దీనిపై ఎలా స్పందిస్తుందో?

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తోందని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ పేద పిల్లలకు ఆ అవకాశం వద్దని 'ఏడుస్తున్న' బాబు గ్యాంగు దీనిపై ఎలా స్పందిస్తుందో? చూడాలి అంటూ మరో ట్వీట్ చేశారు.

ఎరువుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసిన వైసీపీ ఎంపీ

ఎరువుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసిన వైసీపీ ఎంపీ

అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు, చీడపీడలతో పోరాటం చేస్తూ సాగును కొనసాగిస్తున్న రైతాంగానికి పెరిగిన ఎరువుల ధరలు ఆశనిపాతంగా మారాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఎరువుల ధరల భారం నుంచిరైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు వచ్చే బడ్జెట్లో ఎరువులపై సబ్సీడీకి కేటాయింపులు రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. శత్రు వర్గానికి సింహస్వప్నంగా ఆసక్తికరమైన ట్వీట్లతో సంచలనం సృష్టించే విజయసాయిరెడ్డి వైసిపి రెబల్ ఎంపీ

ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే .. రఘురామకృష్ణంరాజుపై ఫైర్

ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే .. రఘురామకృష్ణంరాజుపై ఫైర్

రఘురామకృష్ణంరాజుపై సైతం సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడుతున్నారు. ఇటీవల ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! అంటూ రఘురామ వ్యాఖ్యలపై ఎద్దేవా చేసిన విజయ్ సాయి రెడ్డి ఎన్నుకున్న వారినివదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే అంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.

English summary
Vijayasai Reddy, slams Chandrababu on NTR's death anniversary, said that the corona that came to Chandrababu would be reduced and people would forget it. but back stabbing of NTR would be always remembered by people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X