• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్ళీ వాతలు పెట్టేందుకు సిద్ధం .. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా ఉంటుందన్న సాయిరెడ్డి

|

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, తెలుగుదేశం పార్టీ నేతలపై, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా తీరుపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోమారు ధ్వజమెత్తిన సాయి రెడ్డి చంద్రబాబు విదిల్చే ప్యాకేజీల కోసం ఎల్లో మీడియా ఎగబడిపోతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో పోటీపడి మరీ ఊహాజనిత వార్తలను రాస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మించే స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్(ఫోటోలు)

జనం మళ్లీ వాతలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు

జనం మళ్లీ వాతలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు

చంద్రబాబు అనుకూల మీడియా సంస్థలు ఇక ఊహాజనిత కథనాల రొచ్చును వెదజల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలు కట్టుకథలు ఏంటో, నిజమేంటో తెలుసుకోగలుగుతున్నారు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి, ఎల్లో మీడియాకి మళ్లీ వాతలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.మళ్ళీ ఎన్నికల్లో టీడీపీకి చుక్కలు చూపిస్తారని, మళ్ళీ ఓటమి పాలు కావాల్సిందే అన్న భావన వ్యక్తం చేశారు.

 వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై 20 శాతం నేరాల తగ్గుదల.. ఆ రిపోర్ట్ చెప్పిన సాయిరెడ్డి

వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై 20 శాతం నేరాల తగ్గుదల.. ఆ రిపోర్ట్ చెప్పిన సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీల పై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలో విజయ సాయి రెడ్డి బాబు హయాంలో కంటే ఇప్పుడే ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయని వెల్లడించారు. జగన్ గారి పరిపాలన లో ఎస్సీ ఎస్టీలపై నేరాలు 20 శాతం తగ్గాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం, 96 శాతం కేసుల్లో దోషులను గుర్తించడం, బాధితులకు పరిహారం పెంచడం వంటి అంశాలను కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గుర్తించిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

సిగ్గు శరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ వేదికలా

సిగ్గు శరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ వేదికలా

ఇక ఇదే సమయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి సిగ్గు శరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ వేదికలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ పాలనలో ఉత్తరాంధ్రను ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుంటే ఓర్చుకోలేరని విమర్శించారు. పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో ముఖ్య అతిథులుగా అశోక్ గజపతి, అచ్చెన్నాయుడు పాల్గొనడంపై వ్యంగ్యంగా మాట్లాడారు. విజయనగరం ,శ్రీకాకుళం లను రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలుగా మార్చిన ఘనులు వీరు. ఇక వీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడతారా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి .

పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియాకు జీపీఏ రాసిచ్చారు

పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియాకు జీపీఏ రాసిచ్చారు


ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లు పార్టీని నడిపించలేక చేతులెత్తేసారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియాకు అప్పగించారని విమర్శించారు. ఇంకో రకంగా చెప్పాలంటే జిపీఏ రాసిచ్చారని ఎద్దేవా చేశారు. ఇక ఎల్లో మీడియా రాస్తున్న కథలకు మురిసిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా సాగుతోందని సాయి రెడ్డి సెటైర్లు వేశారు.

English summary
Vijayasaireddy made shocking comments aimed at Chandrababu, Telugu Desam party leaders and the yellow media. Sai Reddy has made harsh remarks that the yellow media is going for packages to be released by Chandrababu. Sai Reddy satires that GPA has written the future of the yellow Party to Yellow Media and that this is the end of 40 years of industry chandrababu politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X