• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాతవన్నీ తిరగతోడుతూ .. అశోక్ గజపతి రాజు, చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులిస్తున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి

|

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా పాత వ్యవహారాలు, టీడీపీ హయాంలో జరిగిన ఘటనలను అన్నింటినీ తిరగతోడుతూ చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇదే సమయంలో అశోక్ గజపతి రాజును సైతం లక్ష్యంగా చేసుకొని విజయసాయి రెడ్డి తనదైన పంథాలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ప్రత్యేక హోదాపై సభలో పోరాటం, చంద్రబాబు టార్గెట్, జగన్ కు కితాబు : మల్టీ టాస్కింగ్ ఎంపీ సాయిరెడ్డిప్రత్యేక హోదాపై సభలో పోరాటం, చంద్రబాబు టార్గెట్, జగన్ కు కితాబు : మల్టీ టాస్కింగ్ ఎంపీ సాయిరెడ్డి

ఓటుకు నోటు కేసులో తన నీడను కూడా తాకలేరన్న ధైర్యంతో చంద్రబాబు

ఓటుకు నోటు కేసులో తన నీడను కూడా తాకలేరన్న ధైర్యంతో చంద్రబాబు

దీనిని బట్టి అర్థం అవుతుంది అది ఏమిటంటే ఓటుకు నోటు కేసులో తన నీడను కూడా తాకలేరన్న ధైర్యంతో ఉన్నాడు చంద్రబాబు అని మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. వ్యవస్థలపై ఆయనకున్న పట్టు అలాంటిది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి అందుకే కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరచడానికి సాహసిస్తున్నాడు అంటూ విమర్శించారు. అంతేకాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారి ఆటలు ఎల్లకాలం సాగవు అంటూ విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

 క్యాపిటల్ పేరుతో భూములు కాజేసిన పచ్చ మందకు కాలేజీల పేరుతో కాజేయడం చిన్న విషయం

క్యాపిటల్ పేరుతో భూములు కాజేసిన పచ్చ మందకు కాలేజీల పేరుతో కాజేయడం చిన్న విషయం

అంతేకాదు క్యాపిటల్ పేరుతో భూములు కాజేసిన పచ్చ మందకు కాలేజీల పేరుతో కాజేయడం చిన్న విషయం అంటూ సైరా పంచ్ వేశారు. కాలేజీల పేరుతో వందల ఎకరాల భూమిని అమ్మేశారు అంటూ పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి టిడిపి ప్రభుత్వ హయాంలో మాన్సాస్ భూముల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి 42 మంది మృతి చెందిన ఘటన కు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

కూనేరు రైలు ప్రమాదంపై అశోక్ గజపతి టార్గెట్ గా ప్రధానికి లేఖ

కూనేరు రైలు ప్రమాదంపై అశోక్ గజపతి టార్గెట్ గా ప్రధానికి లేఖ

కూనేరు రైల్వే ప్రమాద దోషులను శిక్షించాలని, విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి 42 మంది ప్రయాణికులు మృతిచెందినా ఈ ప్రమాదంపై ఎన్ఐఏ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు సంబంధించిన విచారణ సక్రమంగా జరగకుండా సిఆర్ఎస్ ను నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రభావితం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై అత్యున్నత స్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ప్రధానమంత్రికి తాను లేఖ రాసినట్లుగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  YSRCP లోకి వలసల పై విజయ్ సాయి రెడ్డి రియాక్షన్ | Oneindia Telugu
  తప్పు, పప్పు నాయుళ్ళు బరితెగించిపోయారని విమర్శలు

  తప్పు, పప్పు నాయుళ్ళు బరితెగించిపోయారని విమర్శలు

  ఇదే సమయంలో ప్రజా బలంతో 50 శాతానికి పైగా ఓట్లు సాధించి ఘనవిజయం సాధించిన యువ సీఎంపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఒక కోవర్టుని అడ్డంపెట్టుకుని అనుకూల మీడియా తుప్పు,పప్పు నాయుళ్ళు బరితెగించి పోయారని క్షుద్ర రాజకీయాలతో మీరు సాధించేది ఏమీ లేదు అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు వాతలు పెట్టడానికి అంటూ విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుని, బాబుకు అనుకూలంగా జగన్ పై విరుచుకుపడుతున్న వారిని టార్గెట్ చేశారు.

  English summary
  Rajya Sabha member Vijayasaireddy, has recently targeted Chandrababu, reversing all old affairs and events during the TDP regime. At the same time, Vijayasai Reddy continued to make allegations in his own way, targeting Ashok Gajapathi Raju as well.YCP MP Vijayasai Reddy has taken to Twitter to lash out at Chandrababu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X