అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్

|
Google Oneindia TeluguNews

రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్రం నిజాలు రాయడంలేదని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి, అంతకుముందు ఎమ్మెల్యే రోజా అడ్డగింత తదితర ఘటనల నేపథ్యంలో ఆయన వరుస ట్వీట్లతో టీడీపీపై విమర్శలు సంధించారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | 5 Key Deals Between India & USA | Oneindia Telugu
పెప్పర్ గ్యాంగ్..

పెప్పర్ గ్యాంగ్..


అమరావతి భూముల కోసం చంద్రబాబు చాలా నీచమైన చేష్టలకు తెగబడుతున్నారని, సేవ్ అమరావతి పిలుపు ద్వారా రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోతుందని అతిగా ఊహించుకున్నాడని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు పిలుపును జనం పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్'లను వీధుల్లోకి వదిలాడని, రాజధానిలో రచ్చచేస్తోన్న వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు.

40 ఇయర్స్ ఇండస్ట్రీ

40 ఇయర్స్ ఇండస్ట్రీ

అమరావతికి సంబంధంలేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడం లాంటి పనులే చంద్రబాబు 40 ఏళ్ల అనుభవానికి ప్రతీకలా? అని విజయసాయి ప్రశ్నించారు. ఎన్నికల్లో జనం ఛీకొట్టినప్పటి నుంచి.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసేలా టీడీపీ కుట్రలు పన్నుతూనేఉందని ఆరోపించారు. ఏపీకి ప్రతిపక్ష నేత అని చెప్పుకోడానికి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు.

కులం.. కక్ష..

కులం.. కక్ష..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినంతకాలం ప్రతి పనికి ఇంత రేటు చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని, ఏ ఫైలుపై సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా.. ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే చేశారని వైసీపీ ఎంపీ ఆరోపించారు. ప్రజలకు మంచి చేయడం అనే మాట బాబు డిక్షనరీలోనే లేదని, నాడు ఆయన చేసిన తప్పుల్ని బయటికి రానీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడిందని, ఇప్పుడు దోపిడీ వ్యవహారాలు సాక్ష్యాధారాలతోసహా బయటపడుతుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

English summary
ysrcp mp vijayasai reddy slams chandrababu in a series of tweets on tuesday. he accused the tdp paid artists are behind attack on ysrcp leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X