విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వదలబొమ్మాలీ వదల ... గీతం టార్గెట్ గా బాలయ్య అల్లుడికి చుక్కలు చూపిస్తున్న ఎంపీ విజయసాయి

|
Google Oneindia TeluguNews

బాలయ్య చిన్నల్లుడు భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేత నాటి నుండి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గీతం యూనివర్సిటీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తే తప్పేంటి అని మొదలుపెట్టిన విజయసాయి రెడ్డి గీతం యూనివర్సిటీ అనుమతుల రద్దు కోరుతూ కేంద్రానికి , యూజీసీకి వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నారు. నిబంధనలు పాటించటం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

గీతం టార్గెట్ గా .. వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా ? ప్రశ్నించిన ఎంపీగీతం టార్గెట్ గా .. వేల కోట్లు నోట్లకట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా ? ప్రశ్నించిన ఎంపీ

 ఇంజనీరింగ్ అనుమతులు రద్దు చెయ్యాలని ఏఐసీటీయూకి లేఖ రాసిన విజయసాయి

ఇంజనీరింగ్ అనుమతులు రద్దు చెయ్యాలని ఏఐసీటీయూకి లేఖ రాసిన విజయసాయి

తాజాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడం తో పాటుగా ఏఐసీటీఈ నుంచి అక్రమ రీతిలో అనుమతులు సంపాదించిందని ఆరోపిస్తూ విజయసాయిరెడ్డి ఏఐసీటీఈకి లేఖ రాశారు. ఏఐసీటీఈ నియమ నిబంధనలను గీతం యూనివర్సిటీ తుంగలో తొక్కిందని నిజానిజాలు తేల్చేందుకు తక్షణమే విచారణకు ఆదేశించాలని ఆయన ఏఐసీటీయూ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే కు లేఖ రాశారు.

 యూజీసీ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు ..

యూజీసీ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో కేంద్రమంత్రికి ఫిర్యాదు ..

గీతం యూనివర్సిటీ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలతో కూల్చివేతకు పాల్పడిన తర్వాత నుండి ఆయన గీతం యూనివర్సిటీ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గీతం యూనివర్సిటీ టి డి పి నాయకుడు , లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు అయిన శ్రీభరత్ కు చెందినది కావడంతో ఆ యూనివర్సిటీ పై ఇప్పటికే కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు. గీతం యూనివర్సిటీ యూజీసీ నిబంధనలను ఉల్లంఘించిందని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. గీతం కు ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేసే అవకాశం ఉందని, తక్షణం విచారణ జరిపించాలంటూ లేఖలో పేర్కొన్నారు.

జాతీయ వైద్య మండలికి, ఫార్మసీ కౌన్సిల్ కు ఫిర్యాదు లేఖలు

జాతీయ వైద్య మండలికి, ఫార్మసీ కౌన్సిల్ కు ఫిర్యాదు లేఖలు

ఆ తర్వాత జాతీయ వైద్య మండలికి లేఖ రాసి, జాతీయ వైద్య మండలి నిబంధనలు గీతం యూనివర్సిటీ ఉల్లంఘిస్తోందని, అవకతవకలకు పాల్పడుతోంది అంటూ విజయసాయిరెడ్డి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ వైద్య మండలి తనిఖీలు నిర్వహించి తక్షణం అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన జాతీయ వైద్య మండలి చైర్మన్ సురేష్ చంద్ర శర్మ కు లేఖ రాశారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ కు లేఖ రాసి గీతం యూనివర్సిటీ లోని ఫార్మసీ కోర్సులకు అనుమతులు రద్దు చేయాలని కోరారు.

గీతం వ్యవహారాన్ని వదల బొమ్మాలీ వదల అంటున్న విజయసాయి

గీతం వ్యవహారాన్ని వదల బొమ్మాలీ వదల అంటున్న విజయసాయి

గీతం యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించిందని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. సురేష్ కు లేఖరాశారు విజయసాయిరెడ్డి. ఇక తాజాగా ఇంజనీరింగ్ అనుమతులు రద్దు చేయాలంటూ ఏఐసీటీఈ కి లేఖ రాసి గీతం యూనివర్సిటీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల మీద, టీడీపీ నేతల అవినీతి, అక్రమాల మీద నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు విశాఖ గీతం యూనివర్సిటీ పై దృష్టి పెట్టారు . వదలబొమ్మాలీ వదల అంటున్నారు .

English summary
Vijayasaireddy wrote a letter to AICTE alleging that Gitam university had recently acquired government land and illegally obtained permits from AICTE, including the construction of Gitam Deemed University Engineering College buildings in Visakhapatnam. He wrote a letter to AICTE Chairman Professor Anil Sahasrabuddhe asking him to order an immediate inquiry to ascertain the facts that Gitam University had flouted the rules of the AICTE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X