ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం: వ్యతిరేక నినాదాలు

Subscribe to Oneindia Telugu

ప్రకాశం: ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమకు రావాల్సిన వేతనాలు రాకుండా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఉపాధి హామీ కూలీలు ఆయనకు వ్యతిరేక నినాదాలు చేశారు.

 MP YV Subba Reddy faces bitter experience

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కలలో గురువారం చేనేత క్లస్టర్‌ ప్రారంభోత్సవానికి ఎంపీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా.. కూలీలంతా ఒక్కసారి ప్లకార్డులు పట్టుకొని వేదికపైకి దూసుకెళ్లారు.

ఆ తర్వాత, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే ఉపాధి హామీ నిధులు విడుదలలో జాప్యం జరిగిందని వారు ఆరోపించారు. కూలీల ఆందోళనతో సమావేశంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MP YV Subba Reddy faced bitter experience in Prakasam district on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి