వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపిపి ఎన్నికలు: ఎదురులేని చంద్రబాబు, కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లో తమకు తిరుగులేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణలో నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసు చావు దెబ్బ తిన్నది. గురువారం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతో సరిపుచ్చుకున్న కాంగ్రెసు శుక్రవారం ఒక్క ఎంపిపిని కూడా గెలుచుకోలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 625 మండల పరిషత్ తెలుగుదేశం పార్టీ 11 జిల్లాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండు జిల్లాల్లో మాత్రమే ఆధిక్యం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే ఆధిక్యత చూపింది. మిగతా అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఆధిక్యతను చాటుకుంది. మొత్తం 395 మండల పరిషత్తులు ఉంటే 381 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. తెరాస 199, కాంగ్రెసు 114, టిడిపి 37, ఇతరులు 21 చోట్ల విజయం సాధించారు. వివిధ కారణాలతో 24 స్థానాల్లో ఎంపిపి ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తెరాస ఆధిక్యత ప్రదర్శించింది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ఆధిక్యత ప్రదర్శించింది.

 MPP election: TDP wins majority seats in AP

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలవారీగా పార్టీలు గెలుచుకన్న ఎంపిపి స్థానాలు

శ్రీకాకుళం - టిడిపి 26, వైసిపి 12
విజయనగరం - టిడిపి 26, వైసిపి 6
విశాఖపట్నం - టిడిపి 26, వైసిపి 6
తూర్పుగోదావరి - టిడిపి 44, వైసిపి 11, ఇతరులు 2
పశ్చిమ గోదావరి - టిడిపి 42, వైసిపి 3
కృష్ణా - టిడిపి 37, వైసిపి 19, ఇతరులు 1
గుంటూరు - టిడిపి 29, వైసిపి 10
ప్రకాశం - టిడిపి 27, వైసిపి 22
నెల్లూరు - టిడిపి 19, వైసిపి 25
చిత్తూరు - టిడిపి 36, వైసిపి 23
కడప - టిడిపి 16, వైసిపి 27
కర్నూలు - టిడిపి 29, వైసిపి 22
అనంతపురం - టిడిపి 53, వైసిపి 10

తెలంగాణలో జిల్లాలవారీగా పార్టీలు గెలుచుకున్న ఎంపిపి స్థానాలు

ఆదిలాబాద్ - తెరాస 42, కాంగ్రెసు 3, టిడిపి 5, ఇతరులు 1
కరీంనగర్ - తెరాస 43, కాంగ్రెసు 8, ఇతరులు 4
వరంగల్ - తెరాస 16, కాంగ్రెసు 17, టిడిపి 8, ఇతరులు 7
నల్లగొండ - తెరాస 12, కాంగ్రెసు 28, టిడిపి 6, ఇతరులు 6
నిజామాబాద్ - తెరాస 24, కాంగ్రెసు 9, ఇతరులు 1
మెదక్ - తెరాస 26, కాంగ్రెసు 11, టిడిపిప 5, ఇతరులు 1
రంగారెడ్డి - తెరాస 12, కాంగ్రెసు 11, టిడిపి 5, ఇతరులు 3
మహబూబ్‌నగర్ - తెరాస 26, కాంగ్రెసు 20, టిడిపి 11, ఇతరులు 4

English summary
In MPP elections Nara Chandrababu Naidu's Telugudesam party bagged most of the seats in Andhra Pradesh and K Chandrasekhar Rao's lead Telangana Rastra Samithi (TRS) in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X