వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్! చంద్రబాబుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రశంస

ప్రముఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసించారు.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రముఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ శాస్త్రవేత్తయినా నోబెల్‌ బహుమతి సాధిస్తే రూ. 100 కోట్లు బహుమానంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ప్రకటన యువతరానికి, ఇప్పటికే పరిశోధనల్లో ఉన్న శాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్నిస్తుందని అన్నారు. ఒలింపిక్స్‌లో బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలిచిన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా పెద్ద మొత్తాల్లో ధనం ఇస్తుంటాయి.. అలాంటప్పుడు నోబెల్‌ విజేతలకూ బహుమానం ప్రకటించడం తప్పుకాదని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబూ ఇది తగునా! : రూ.100కోట్లపై శాస్త్రవేత్తల అసంతృప్తి

అలాంటి శాస్త్రవేత్తకు బహుమానం ప్రకటించడం మంచిదేనని, ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని స్వామినాథన్ అన్నారు. కాగా, చంద్రబాబు 100కోట్ల బహుమతి ప్రకటించడంపై రెండ్రోజుల క్రితం పలువురు శాస్త్రవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

MS Swaminathan praises Chandrababu

భట్నాగర్ అవార్డు గ్రహీత , ఇక్రిశాట్ శాస్తవ్రేత్త డాక్టర్ రాజీవ్‌ కుమార్‌ వర్షీనియా చంద్రబాబు ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతులు పొందాలంటే కావాల్సింది బహుమతులు కాదని, ముందుగా బాల శాస్తవ్రేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

పరిశోధనలకు నిధులు ఇవ్వకుండా ఆవిష్కరణలు చేయమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రయోగశాలలు రూపొందించాలన్నారు. ఇలాంటి ప్రణాళికలు రూపొందించి రూ.100 బహుమతి ప్రకటించి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని, ఇప్పటికీ మించిపోయింది లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Geneticist MS Swaminathan praised Andhra Pradesh CM Chandrababu Naidu for announcing Rs 100 crores to nobel prize winner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X