వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తిస్తా: తెలుగు క్రికెటర్లకు అన్యాయంపై ఎమ్మెస్కే ప్రసాద్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ బుధవారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్యూలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ టాలెంట్ ఎక్కడ ఉన్న తాను గుర్తిస్తానని చెప్పారు. తెలుగు క్రికెటర్లకు అన్యాయం జరుగుతోందని వస్తోన్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఆట‌గాళ్ల సామర్థ్యాన్ని బ‌ట్టి జట్టులోకి ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని చెప్పారు.

MSK Prasad

దేశ ప్రయోజనాల కోసమే సెలెక్టర్లు పనిచేస్తారని, ప్రతిభ ఉన్న‌వారంద‌రినీ ప్రోత్స‌హిస్తార‌ని చెప్పారు. తెలుగురాష్ట్రాల క్రికెట‌ర్లు రాణిస్తే వారికి తప్పక అవ‌కాశం ఇస్తాన‌ని తెలిపారు. మ‌నం చేసే ప‌నినిబ‌ట్టే మ‌నకు గుర్తింపు వ‌స్తుంద‌ని తెలిపారు. తెలుగు వాడిగా అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

దేశంలో టాలెంట్ ఎక్కడ ఉంటే దానిని గుర్తించడమే సెలెక్టర్ల బాధ్యత అని తెలిపారు. భారత జట్టుకు ఆటగాళ్ల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తాన‌ని చెప్పారు. తాను ఏడాది కాలంలోనే బీసీసీఐ నమ్మకాన్ని పొందినట్లు చెప్పారు. మనం చేసే పనులతోనే మన పై అధికారులకు మనపై నమ్మకం కలుగుతుందని చెప్పారు.

చీఫ్ సెలెక్టర్‌గా తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. అన్ని ఫార్మాట్ల‌లో సత్తా చాటే మంచి టీమ్‌ను సెలెక్ట్ చేస్తాన‌ని అన్నారు. గురువారం జ‌ర‌గ‌నున్న 500వ టెస్టును చూసేందుకు గాను కాన్పూర్ వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ను బీసీసీఐ సందీప్ పాటిల్ స్థానంలో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

English summary
Former India wicketkeeper-batsman MSK Prasad was on Wednesday (September 21) appointed by the BCCI as the chairman of the new selection committee of the Indian cricket team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X