వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిలతో తగాదాలు పెట్టాలని.. బీసీ కోటాలో వద్దు: ముద్రగడ

తమకూ బీసీలకు మధ్య తగాదాలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, తాము బీసీ కోటాలో రిజర్వేషన్లు తీసుకోబోమని ముద్రగడ పద్మనాభం అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: బీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తీసుకోబోమని, తమకు ప్రత్యేకంగా రిజర్వేషన్ల కోటా కేటాయించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. బీసీలుకు, కాపులకు మధ్య తగాదా పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తాము ఇక ఐక్యంగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.

మంజునాథ కమిషన్‌కు వినతిపత్రా లు ఇవ్వడానికి కాపులకో రోజు, బీసీలకో రోజు కేటాయించాలని అడుగుదామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తన అనుచరులతో కలసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు ఇంటిలో వివిధ బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.

Mudragada Padmanabham

వారితో చర్చలు జరిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీలలో చేర్చితే ప్రస్తు త బీసీలకు నష్టం జరుగుతుందేమోననే అనుమానం ఉందని, అందువల్ల వారి అనుమానాలు నివృత్తి చేయడానికి బీసీ నేతల ఇంటికి వెళుతున్నానని ఆయన చెప్పారు.

తొలుత బీసీసంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డిని కలిస్తే పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, మార్గాని నాగేశ్వరరావు వంటి నేతలు అటువంటి అభ్యంతరాలే వ్యక్తం చేశారన్నారు.

వాస్తవానికి బీసీలు పొందుతున్న రిజర్వేషన్లు తమకు అవసరం లేదని, వాటిని ఇచ్చినా తాము తీసుకునేది లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు అదనంగా పెంచి, వర్గీకరణలో తమకు ఓ గ్రూపు కేటాయించాలని మాత్రమే ఉద్యమిస్తున్నామని ఆయన అన్నారు.

English summary
Kapu leader Mudragada Padmanabham said that kapus do not need reservations in BC quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X