వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన అధినేతకు కాపు నేత ఝలక్...పవన్‌కళ్యాణ్ ఎవరో తెలియదన్న ముద్రగడ

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: మంత్రసాని పని ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా తియ్యాలి...గొడ్డు వచ్చినా తియ్యాలి అనేది చాలా పాత ముతక సామెత...అయితే అది ఈనాటికి రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటే...

తమ రంగంలో వారు ఎంతటి లబ్ధ ప్రతిష్టులైనా ఒక్కసారి...రాజకీయాల్లోకి...ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించాక వారు ఎలాంటి విమర్శలైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో అగ్ర కథానాయకుడుగా ఉన్న ఆయన రాజకీయ రంగంలో తానసలేమాత్రం ఊహించని విమర్శలు, పంచ్ లు ఎదుర్కొంటున్నారు. తాజాగా...కాపునేత ముద్రగడ పద్మనాభం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇలాంటి ఝలక్ ఇచ్చారు. అసలు పవన్ కణ్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు.

mudragada padmanabham strange Answer about pawan kalyan

Recommended Video

Kapu Reservations : Mudragada on 5 Percent qouta for Kapus | Oneindia Telugu

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాపునేత ముద్రగడ పద్మనాభం పర్యటించారు. వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదన్నారు. అతనెవరో నాకు పరిచయంలేదని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.

English summary
kapu leader mudragada padmanabham strange Answer On jana sena chief pawan kalyan in nellore district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X