వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధేస్తోంది! మిమ్మల్నెవరు అడిగారు?: జగన్‌పై ముద్రగడ నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు.

జగన్‌పై మండిపడ్డ ముద్రగడ

జగన్‌పై మండిపడ్డ ముద్రగడ

తన కాపు జాతికి కావాల్సింది రిజర్వేషన్లే కానీ, సానుభూతి కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Recommended Video

కాపు రిజర్వేషన్స్ పై జగన్ క్లారిటీ
హామి ఇచ్చిన మనిషినే అడుగుతున్నాం..

హామి ఇచ్చిన మనిషినే అడుగుతున్నాం..

‘మాకు హామీ ఇచ్చిన హామీ న్యాయమైంది. అమలు చేయండి అని అడుగుతున్నాం. మేమేమీ అడగలేదే. ఆయన్ను చేయమని అడగలేదే. చేస్తానని హామీ ఇచ్చిన మనిషిని అడుగుతున్నాం' అని ముద్రగడ అన్నారు.

జగన్ వ్యాఖ్యలతో బాధేస్తోంది..

జగన్ వ్యాఖ్యలతో బాధేస్తోంది..

‘ఇచ్చిన హామీ అడుగుతుంటే.. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లు అవుతుంది. రాజ్యాంగ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు. ఫిఫ్టీ పర్సంటే ఉంది.. ఏం రాజ్యాంగం రాసేసినట్లు, రాజ్యాంగాన్ని చదివేసినట్లు మాట్లాడుతుంటే బాధేస్తోంది' అని జగన్ వ్యాఖ్యాలనుద్దేశిస్తూ ముద్రగడ అన్నారు.

 మిమ్మల్నెవరు అడిగారు? జగన్‌పై ఆగ్రహం

మిమ్మల్నెవరు అడిగారు? జగన్‌పై ఆగ్రహం

‘అసలు ఎవరు అడిగారు ఆయన్ను(వైయస్ జగన్మోహన్ రెడ్డిని)? అడక్కుండానే నేను ఇవ్వను, ఆలోచన చేయను.. ఎందుకు చెప్పాలి సార్?.. ఆయనకు సంబంధమేంటి? అధికారంలో లేని మనిషి ఎందుకు మాట్లాడాలి? మేము అడుక్కోలేదే.. మా జాతి గురించి మేము అడుక్కోలేదే.. అనవసరంగా మాట్లాడారు కాబట్టి, సమాధానం చెబుతున్నాం. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అడుగుతున్నాం' అని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

English summary
Former minister Mudragada Padmanabham on Monday takes on at YSRCP president YS Jaganmohan Reddy for kapu reservation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X