వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో బాబుదే తప్పు, బ్రాహ్మణులూ తడాఖా చూపించాలి: ముద్రగడ

2019 ఎన్నికల్లో బ్రాహ్మణులు కూడా తమ తడాఖా చూపించాలని, ఐవైఆర్ కృష్ణా రావు ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది తప్పు అని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల్లో బ్రాహ్మణులు కూడా తమ తడాఖా చూపించాలని, ఐవైఆర్ కృష్ణా రావు ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది తప్పు అని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం మండిపడ్డారు.

<strong>ఆ బాధ్యత జగన్‌దే, మాట్లాడతా: అఖిల, బాబుకు వైసిపి ఊహించని షాక్</strong>ఆ బాధ్యత జగన్‌దే, మాట్లాడతా: అఖిల, బాబుకు వైసిపి ఊహించని షాక్

చంద్రబాబుకు లేఖ

చంద్రబాబుకు లేఖ

ఆయన చంద్రబాబుకు మరో లేఖ రాశారు. లేఖ సారాంశం... 'ప్రజలతో, బీసీ నేతలతో చర్చించి 100 శాతం ఏకాభిప్రాయం తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని తమరు ఇటీవలే సెలవిచ్చారు. దేశమంతా పర్యటించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.

మేం బీసీ కోటా అడగటం లేదు

మేం బీసీ కోటా అడగటం లేదు

ఈ చిలుక పలుకులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినప్పుడు, పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం పెట్టినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు?. బీసీల కోటాలో మా జాతికి వాటా ఇవ్వాలని అడగడం లేదు.

ప్రత్యేక కేటగిరీ కింద..

ప్రత్యేక కేటగిరీ కింద..

ప్రత్యేక కేటగిరి కిందే రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్‌ ఇస్తామని పదేపదే మాట్లాడుతున్నారు. మా మద్య తగవులు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం మీకు అలవాటైంది.

మీ ఖ్యాతి ఖండాంతరం

మీ ఖ్యాతి ఖండాంతరం

మూడేళ్లుగా రిజర్వేషన్లను డీఫ్రిజ్‌లో పెట్టి 2019లో మళ్లీ మా వాళ్లతో ఓట్లు వేయించుకోవాలనే మీ కుట్రను తెలుసుకోలేనంత స్థితిలో మా జాతి లేదు. కాపు రిజర్వేషన్లపై ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఏకాభిప్రాయానికి రండి. అప్పుడు మీ ఖ్యాతి ఖండాంతరంగా విరాజిల్లుతుంద'ని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడారు. ఐవైఆర్ కృష్ణా రావు ఎపిసోడ్‌లో చంద్రబాబుది తప్పు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులు తమ తామేంటో చూపించాలని సూచించారు.

English summary
Kapu Leader Mudragada Padmanabham wrote another letter to Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X