వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఒక్క మాట చెప్తే చాలు, కాపులు ఏమైనా చేస్తారు: ముద్రగడ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను ఒక్క మాట చెప్తే చాలు, ఏం చేసేందుకైనా కాపులు వెనుకాడరని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఒక టివి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాటలన్నారు. కాపులంతా తనతోనే ఉన్నారని చెప్పారు. అందుకే తాను కాపు లు విధ్వంసానికి దిగలేదని చెబుతున్నానని ఆయన తెలిపారు.

తాను ఎవరికైనా 'విధ్వంసానికి దిగండి' అని చెప్పి ఉంటే, అలా జరిగి ఉండేది కానీ, తాను ఎవరికీ అలా చేయమని చెప్పలేదని ఆయన తెలిపారు. కేవలం రాస్తా రోకో, రైల్ రోకోకి పిలుపు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. తాను విధ్వంసాన్ని ప్రోత్సహించే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. కాపుల ప్రయోజనం కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన చెప్పారు.

Mudragada says Kapus will follow his words

తమ వెనుక ఎవరూ లేరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కాగా, కాపులు బిసిలకు వ్యతిరేకమనే వాదన ఒకటి వినబడుతోందని, అది సరి కాదని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి ముద్రగడ ప్రస్తావిస్తూ, బిసి రిజ ర్వేషన్లలో తాము వాటా అడగడం లేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వాలు అమ లు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో తమను చేర్చవద్దని ఆయన సూచించారు.

జనరల్ కేటగరీ కోసం ఉంచిన 50 శాతంలో తమకు వాటా కల్పించ వలసిందిగా కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. దానికి ఏ పేరు పెట్టినా ఫర్వాలేదని చెప్పిన ముద్రగడ తమకు రిజర్వేషన్ అందులో నుంచే కావాలని డిమాండ్ చేశారు. ఇలా అడుగుతున్నందునే తమకు అందరూ మద్దతు ఇస్తు న్నారని ఆయన తెలిపారు. అయితే, తమకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలో ప్రభు త్వమే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.

English summary
Kapu leader and ex minister Mudragada Padmanabham said that Kapus will follow his words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X