వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్టీ ప్రతిపాదన, ముద్రగడ వ్యూహాత్మక మౌనం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాకినాడ: మాజీ ఎంపీ హర్ష కుమార్, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంలు కలిశారు. వీరిద్దరి మధ్య ఆదివారం చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వీరి మధ్య కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపులు, దళితులు కలిసి కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

రెండు బలమైన వర్గాలు కలిస్తే రాజకీయాలను శాసించవచ్చునని వారు భావిస్తున్నారని అంటున్నారు. అయితే, హర్ష కుమార్ ఈ ప్రతిపాదన తేగా ముద్రగడ మౌనం వహించారని తెలుస్తోంది. కొత్త పార్టీ ప్రతిపాదన హర్ష కుమార్ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని ముద్రగడ చెప్పారు.

 Mudragada silent on Harsha Kumar New party proposal

హర్షకుమార్‌తో ముద్రగడ సమావేశం కావడం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. హర్షకుమార్ ఇంటికి వెళ్లి ముద్రగడ ఆయనతో సమాశం అయ్యారు. కొత్త పార్టీ అంశం గురించి హర్షకుమార్‌ను మీడియా ప్రశ్నించగా... ప్రజలు కోరకుంటే ఏమైనా జరగొచ్చన్నారు.

అదే సమయంలో ముద్రగడ పెదవి విప్పకపోవడం గమనార్హం. కేవలం మర్యాదపూర్వకంగానే హర్షకుమార్‌తో భేటీ అయ్యానని తెలిపారు. అయితే, వీరి సమావేశం, హర్షకుమార్ మాటలు.. నేపథ్యంలో కొత్త పార్టీ ఊహాగానాలను బలపరుస్తున్నాయి.

English summary
Mudragada Padmanabham silent on Harsha Kumar New party proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X