వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ మహిళా నేత ముళ్లపూడి రేణుకకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి:కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథార్టీ సంస్థకు డైరెక్టర్‌గా తణుకు పట్టణానికి చెందిన టిడిపి నాయకురాలు ముళ్లపూడి రేణుకను సిఎం చంద్రబాబు ఎంపికచేశారు.

రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కీలకమైన పదవీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు ఆమె మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో వినియోగదారుడు మోసపోకుండా చూడటానికి పూర్తి సమాచారాన్ని పారదర్శకంగా అందించడానికి రెరా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

ఇకపై 8 ప్లాట్‌లకు పైబడి రియల్ ఎస్టేట్‌ వెంచర్ అప్రూవల్‌ పొందాలన్నా, 500 స్కేర్‌ మీటర్లు బిల్డింగ్‌ ప్లింతేరియా పైబడి భవనాన్ని నిర్మించి అమ్మాలన్నా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరి అథార్టీ (రేరా) పరిధిలో నమోదు చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఇకమీదట ఎల్‌పీ అనేది ఉండదని రేరా పరిధిలోనే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తనకు అప్పగించిన రేరా డైరెక్టర్‌ పదవికి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హోదా లభిస్తుందని ఆమె వెల్లడించారు.

Mullapudi renuka appointed as Director of Andhra Pradesh Real Estate Regulatory Authority

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఫార్సుగా మారిందని ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆ సంస్థకు డైరక్టర్ ను నియమించడం ద్వారా వాటికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎపిలో వెబ్‌సైట్‌ ప్రారంభించి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ అధారిటీ డైరెక్టర్, కమిటీ సభ్యుల నియామకం జరగలేదు. దీంతో ప్రాజెక్టుల నమోదు ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదన్న విమర్శల క్రమంలో ఈ నియామకం జరిగింది.

ఇకమీదట రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు సైతం రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రియల్‌, అపార్టుమెంట్‌ సేల్స్‌ ఏజెంట్లు రాష్ట్రంలో సుమారు ఐదు వేల మందికిపైగా ఉంటారు. అయితే ఇప్పటికి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం రెండంకెలు దాటలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రెరాలో సమోదు
నమోదు చేసుకోకుండా ఏ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రచారం నిర్వహించినా నేరమే.

రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల క్రయ, విక్రయాలు నిర్వహించడం, నూతన వెంచర్ల ప్రచారం నిర్వహించ కూడదని చట్టంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల ప్రచారాన్ని గమనించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ప్రచారం చేస్తున్న సంస్థలకు నోటీసులు అందించి రిజిస్ట్రేషన్‌లు జరగకుండా నివారిస్తారు.

English summary
Mullapudi renuka appointed as Director of Andhra Pradesh Real Estate Regulatory Authority
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X