వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ టెక్కీ అనూహ్య కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష

|
Google Oneindia TeluguNews

ముంబయి : ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనూహ్య కేసులో ముంబయి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రభాన్ సనప్ ను దోషిగా ప్రకటిస్తూ ఉరిశిక్ష ఖరారు చేసింది. గతంలో మహిళా స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సమర్థించింది. మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అతడికి మరణశిక్షే సరైన శిక్ష అని అభిప్రాయపడింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబయిలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేసేవారు. క్రిస్మస్ పండుగను స్వస్థలంలో జరుపుకొనేందుకు 2013, డిసెంబర్ చివరలో మచిలీపట్నంకు చేరుకున్నారు. సెలవులు పూర్తయ్యాక్య 2014, జనవరి 4న ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి ముంబయి బయలుదేరారు.

mumbai highcourt sensational verdict in techie anuhya case


అయితే జనవరి 5న తెల్లవారుజాము 4 గంటల సమయంలో నిందితుడు చంద్రభాన్ సనప్ ఎల్టీటీ రైల్వే స్టేషన్ కు చోరీ కోసం వచ్చాడు. ఆ సమయంలో అనూహ్య ఒంటరిగా కనిపించేసరికి దుర్బుద్ధి పుట్టింది. దీంతో అప్పటికప్పుడు ట్యాక్సీ డ్రైవర్ అవతారమెత్తాడు. తక్కువ మొత్తానికే అంధేరీలోని తన హాస్టల్ దగ్గర దించుతానంటూ మాటలు కలిపాడు. తెల్లవారుజాము కావడం, ట్యాక్సీవాలాలు ఎక్కువ ధర చెబుతుండటంతో చంద్రభాన్ చెప్పిన ఛార్జీ అనూహ్యకు ఒకే అనిపించడంతో అతడిని అనుసరించింది. తీరా రైల్వే స్టేషన్ బయటికొచ్చాక ట్యాక్సీలో కాకుండా బలవంతంగా టూ వీలర్ పై ఎక్కించుకుని బయలుదేరాడు.

చంద్రభాన్ నివాసముండే కార్వేనగర్ కు కొద్ది దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. వదిలివేయాలంటూ ఎంతగా ప్రాధేయపడ్డా కనికరించలేదు. అంతేకాదు అత్యంత క్రూరంగా పెట్రోల్ పోసి హతమార్చాడు. అప్పట్లో టెక్కీ అనూహ్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు టేకప్ చేసిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 36 సీసీటీవీ ఫుటేజ్ లతో దర్యాప్తు ప్రారంభించడంతో చంద్రభాన్ అడ్డంగా దొరికిపోయాడు. సాక్ష్యాధారాలతో నేరం రుజువయింది. దీంతో 2015లోనే మహిళా ప్రత్యేక న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. అయితే నిందితుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. దాదాపు మూడేళ్లపాటు ఈ కేసును విచారించిన ముంబయి హైకోర్టు చంద్రభాన్ కు మరణశిక్ష విధించిన కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఉరిశిక్ష ఖరారు చేసింది.

English summary
The Mumbai High Court issued a sensational verdict in the rape and murder case of software employee of AP. Chandrabhan Sanaph was convicted and condemned to death. In the past, the woman's Special Court given justice that Requiem to chandrabhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X