వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడేమైంది: మురళీమోహన్‌పై రోజా, జీవిత, కవిత ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ చేసి సెక్సీయెస్ట్ వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా నేతలు మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భారతీయ జనతా పార్టీ నేత, నటి జీవిత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే, నటి రోజాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మురళీ మోహన్ ఇప్పుడు సుద్దులు చెబుతున్నారని, ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు తాను చెబుతున్న వాటిని పాటించలేదని ఎద్దేవా చేశారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

మురళీ మోహన్ గురువారం సెక్సీయెస్ట్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే తాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని, క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని ఆయన చెప్పారు. అయితే, ఈయన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలోను విమర్శలు వస్తున్నాయి.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

మురళీ మోహన్ వ్యాఖ్యలు సరికాదని, ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారో, ఆయన తన సినీ కెరీర్ సమయంలో దానిని పాటించలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మోడర్న్ డ్రెస్‌లే కారణమంటే చిన్నారుల పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

రోజా

రోజా

మురళీ మోహన్ వ్యాఖ్యలను రోజా ఖండించారు. మురళీ మోహన్ చెప్పిన డిగ్నిఫైడ్ అంటే ఏమిటన్నారు. జీన్, టీ షర్ట్ కంటే చీరలోనే ఎక్కువ ఎక్స్‌పోజ్ ఉంటుందని రోజా కౌంటర్ ఇచ్చారు.

 జీవిత

జీవిత

మురళీ మోహన్ వ్యాఖ్యలు సరికాదని జీవిత అన్నారు. ఆయన తాను సినిమా హీరోగా నటించినప్పుడు ఇప్పుడు చెబుతున్న దానిని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.

English summary
A sexist remark by first-time Telugudesam MP from Rajahmundry Murali Mohan Maganti, calling upon women to dress in a dignified manner, triggered vociferous protests from other members in the Lok Sabha on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X