రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ‌కీయాల‌కు ముర‌ళీ మోహ‌న్ గుడ్ బై : ఇక సేవా కార్య‌క్ర‌మాల‌పైనే దృష్టి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజ‌కీయాల‌కు ముర‌ళీ మోహ‌న్ గుడ్ బై : ఇక సేవా కార్య‌క్ర‌మాల‌పైనే దృష్టి..! | Oneindia Telugu

టిడిపి నేత‌..రాజ‌మండ్రి ఎంపి..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు అత్యంత సన్నిహితుడు అయిన ముర‌ళీ మోహ‌న్ క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్నా రు. ఆయ‌న‌తో పాటుగా కుటుంబ స‌భ్యులు సైతం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌నున్నారు.

టిడిపి లో క్రియాశీల‌కంగా..

టిడిపి లో క్రియాశీల‌కంగా..

సినీ న‌టుడు గా అంద‌రికీ సుప‌రిచితుడైన ముర‌ళీ మోహ‌న్ తొలి నుండి టిడిపికి అనుబంధంగా వ్య‌వ‌హ‌రించారు. 1995 లో చంద్ర‌బాబు తొలి సారి ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యం నుండి టిడిపి లో క్రియా శీల‌కంగా ఉన్నారు. హైటెక్ సిటీ.. మాదాపూర్..శంషాబాద్ ఏయిర్ పోర్టు నిర్మాణాల స‌మ‌యంలో నిర్మాణ రంగంలో ఉన్న ముర‌ళీ మోహ‌న్ టిడిపి అండ తో బాగా లాభ‌ప‌డ్డార‌ని ఇత‌ర పార్టీల నేత‌లు ఆరోపిస్తూ ఉంటారు. టిడిపి కి మద్ద‌తు దారుడిగా ఉన్నా..ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో మాత్రం 2014 వ‌ర‌కు పోటీ చేయ‌లేదు. 2014 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుండి టిడిపి ఎంపి అభ్య‌ర్దిగా బ‌రిలోకి దిగారు. ఆ ఎన్ని క‌ల్లో రాజ‌మండ్రి ఎంపీగా విజ‌యం సాధించారు. అప్ప‌టి నుండి అటు లోక్‌స‌భ‌లో ..ఇటు రాజ‌మండ్రిలో యాక్టివ్ గా ఉం టూ వ‌స్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ‌లు రూప బ‌రిలోకి దిగుతార‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌ర‌గుతోంది. కానీ, అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసే స‌మ‌యంలో ముర‌ళీ మోహ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై..!

క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై..!

ఇక‌, నుండి క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని ముర‌ళీ మోహ‌న్ నిర్ణ‌యించారు. అందులో భాగంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్న‌యం తీసుకున్నారు. త‌న‌తో పాటుగా త‌న కుటుంబ స‌భ్యులు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని ముర‌ళీ మోహ‌న్ చెబుతున్నారు. శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి వ‌ద్ద రాజ‌మండ్రి లోక్‌స‌భ ప‌రిధి లో అసెంబ్లీ అభ్య‌ర్దుల ఎంపిక పై స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ముర‌ళీ మోహ‌న్ కు ఆహ్వానం అందింది. ఈ స‌మావేశానికి హాజ‌రై త‌న అభిప్రాయాన్ని ముఖ్య‌మంత్రికి చెబుతాన‌ని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేసారు.

ముఖ్య‌మంత్రి ఎలా స్పందిస్తారు

ముఖ్య‌మంత్రి ఎలా స్పందిస్తారు

అయితే ముర‌ళీ మోహ‌న్ అభిప్రాయం పై ముఖ్య‌మంత్రి ఎలా స్పందిస్తారు.. ఈ సారికి బ‌రిలో ఉండ‌మ‌ని కోరుతారా లేక ముర‌ళీ మోమ‌న్ కోరుకున్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో విశ్రాంతి ఇస్తారా అనేది చూడాలి. ఇక‌, తాను ఇప్ప‌టికే ప్రారంభించిన ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తాన‌ని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు.

English summary
TDP senior leader, Rajahmundry MP Murali Mohan decided to quit active politics. He says no interest on contesting in ap coming elections. He wants to continue in social service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X