వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్, వైఎస్ ల చిత్ర పటాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం ..రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు,అలాగే నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికు ముస్లింలు పాలాభిషేకం చేశారు. తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ మైనార్టీలకు అంతగా ఆనందం కలిగించిన అంశం ఏంటి అంటే

సీఎం జగన్ మార్క్: విద్యా కానుక,మానసిక వికలాంగుల స్కూల్స్ తో పాటు పలు కీలక నిర్ణయాలుసీఎం జగన్ మార్క్: విద్యా కానుక,మానసిక వికలాంగుల స్కూల్స్ తో పాటు పలు కీలక నిర్ణయాలు

ఏపీలో టెన్షన్ పడిన మైనార్టీలు

ఏపీలో టెన్షన్ పడిన మైనార్టీలు

ఏపీ వైసీపీలో సీఏఏ, ఎన్నార్సీ లపై మొన్నటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరదించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పటికే వాటిని వ్యతిరేకిస్తూ పంజాబ్ , కేరళ , మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు కూడా చేశాయి. తెలంగాణాలో కూడా సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ఏపీలో కేంద్రానికి అనుకూల నిర్ణయం తీసుకుంటారని మైనార్టీలు టెన్షన్ పడ్డారు.

ఎన్పీఆర్ విషయంలో సీఎం జగన్ నిర్ణయంతో హర్షం

ఎన్పీఆర్ విషయంలో సీఎం జగన్ నిర్ణయంతో హర్షం

పార్లమెంట్లో సిఏఏ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అని సందిగ్ధంలో ఉండగానే జగన్ ఎన్పీఆర్ విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని చెప్పటం , 2010 తరహాలో కేవలం కుటుంబ వివరాలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని అలా కాకుండా ముస్లింలను అభద్రతా భావానికి గురి చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పటం అటు కేంద్రాన్ని ఇబ్బందిలో పడేసింది కానీ మైనార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.

కేంద్రానికి జగన్ మెలిక ... మైనార్టీలకు ఇబ్బంది లేకుంటేనే

కేంద్రానికి జగన్ మెలిక ... మైనార్టీలకు ఇబ్బంది లేకుంటేనే

ఎన్పీఆర్ విషయంలో కేంద్రం ఏపీ సూచనలు తీసుకుని అభ్యంతరకరంగా ఉన్న వాటిని పక్కన పెట్టి జాతీయ జనాభా పట్టిక తయారు చేస్తే సరి. కానీ అలా కాకుంటే ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని సీఎం జగన్ చెప్పటంతో ఏదైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తమకు లాభం చేకూరుతుంది అని భావిస్తున్న మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే కోటంరెడ్డి ఎన్‌పీఆర్‌‌కి వ్యతిరేకంగా నెల్లూరులో భారీ సభను ఏర్పాటు చేశారు. ఎన్‌పీఆర్‌‌ని బాహాటంగానే వ్యతిరేకించారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Nara Brahmani To Enter Active Politics | YSRCP MLA Deadline To YS Jagan
 నెల్లూరులో జగన్ , వైఎస్ లతో పాటు ఎమ్మెల్యేకు పాలాభిషేకం

నెల్లూరులో జగన్ , వైఎస్ లతో పాటు ఎమ్మెల్యేకు పాలాభిషేకం

అందుకే నెల్లూరులో సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల ఫోటోలతో పాటు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ముస్లింలు పాలాభిషేకం చేశారు . అంతేకాదు వారి ఆచారాల ప్రకారం ఆయనను సన్మానించారు. ఎన్‌పీఆర్‌కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయడంతో పాటు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారు ఈ విధంగా తమ కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇక సీఎం జగన్‌తో పాటు మాజీ సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు సైతం ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ముఖ్యమంత్రి జగన్ అండదండలతో, మంత్రి అనిల్ కుమార్ సహకారంతో ఎన్‌పీఆర్‌పై మైనార్టీల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .

English summary
Muslims in Nellore Rural YCP MLA Kotam Reddy Sridhar Reddy along with photos of CM Jagan and YS Rajasekhar Reddy Anointed with milk . And they honored him according to their customs. They expressed their gratitude to the AP Cabinet for its decision against the NPR and the government's announcement that it would be resolved at the next Assembly session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X